వైఫ్;- డా.రామక కృష్ణమూర్తి
 ప్రేమ ఇస్తే చాలు
తాను ప్రాణమవుతుంది.
పట్టించుకుంటే చాలు
తాను జీవిత పరమార్థమే అవుతుంది.
గౌరవించి చూడు 
తాను గాండీవమవుతుంది.
పలకరిస్తూ ఉండు
ప్రమిద తా‌నై వెలుగునిస్తుంది.
వెంట నడిచి చూడు
తానొక ప్రకృతవుతుంది.
నేనున్నానని తెలుపు
కంటిపాప తానై దారి చూపుతుంది.
ఒక్క ముద్ద నోటికందించు
అమృతం తానై నిలుస్తుంది.
ఆలింగన మొక్కటి చాలు
ఆలి సర్వమై నడుపుతుంది.
చిరునవ్వొక్కటి చాలు కదా
శ్రీమతొక బహుమతి కావడానికి.
సంతోషం నీవై కదలాడితే 
సహధర్మచారిణి తాను స్వర్గమైపోతుంది.
నీ ఆదరణే కొండంతైతే
అర్థాంగి అమ్మ కాదా!


కామెంట్‌లు