సాహిత్యం; - కొప్పరపు తాయారు

  దీర్ఘం,య,వత్తు పక్కన పెడితే , స,హితము మంచి
తో మన కిష్టమైన దానితో కూడినది అని అర్థం.
               కానీ సాహిత్యము అంటే లాటిన్ అర్థం ప్రకారం (బహువచనం/ అక్షరం) ,
                  ఈ ప్రక్రియకు అవధులు లేవు మన తెలుగు భాషను  బట్టి సాహిత్యం అంటే అక్షర విన్యాసం 64 కళలతో, అని  సుతి మెత్తని భావన!
               ఇందులో వర్గీకరణము, వర్గ విభేదం ! కానీ సాహిత్య కల్పన శ్రేష్టత ఉపయోగించాలి. మనసును మహిమాన్వితం చేసేది సాహిత్యం. మన జీవన సరళి, మనుగడ, ప్రతీ కాలగతుల తెలియ చెప్పేది, విశ్లేషించేది ,వివరణ ఇచ్చేది సాహిత్యం!!
          తరతమ  బేధాలు లేకుండా పరనింద లేకుండా కాల పోకడలలో తప్పొప్పుల జాబితా చేపట్టి ,సత్కార్యం చేయు నీతితో తన వారితో పాటు తన సమాజానికి  నవ్యత బోధించు ప్రతీ అక్షరం
అసమాన్యం, అనన్యం!
         సాహిత్యంలో అక్షర ప్రాధాన్యం ఉంది అక్షర పొందికలో ఉద్భవించిన పదాలు సక్రమమైన రీతిలో
 సంస్కృతి పంధాలో ధర్మాన్ని పాటిస్తూ, హృదయ స్పందన, ఉత్తేజ పరచాలి. కొన్ని కొన్ని సమయాలలో సంతోషపరచాలి, కొన్ని పరిస్థితులలో అవగాహన సరళిలో అద్భుత ప్రబోధ తత్వం తో నిరవధికంగా జరిగే మహా అక్షర యజ్ఞం ఈ సాహిత్య పంధా!!
                    దీనిని చేపట్టిన ప్రతీ మనిషీ పరిమితితో సంస్కారయుత, జ్ఞాన, విజ్ఞాన, హేలలో మంచిని అందించే ప్రక్రియ మహిమాన్వితం!!
                    సంస్కారం సాహితీపరంగా దిగజారకూడదు అట్టి నడత వలన వాక్కు అక్షరం మయిలబడి సిగ్గుపడతాయి..
              భావోద్వేగాలు కాదు  భావపరంపరలతో
 సంస్కారయుత గతం విలువలు నిలబెట్టే ప్రతి ఒక్క
అక్షరానికి వంగి వంగి నమస్కరించక తప్పదు అదే మన సంస్కారం మన అభివృద్ధి.
                ఈ ఆలోచనలో బాగుపడదాం బాగు చేద్దాం, బాగుందాం అనే భావన ఉంటే సాహిత్యం ఒక ఆయుధం సమాజాన్ని చక్కదిద్ది బంగారు బాటలో నడిపిస్తుంది!!!
కామెంట్‌లు