* హాయిగ ఆనందించేరు *;- కోరాడ నరసింహా రావు
  బాలల్లారా.... మీ బాల్యం 
    జీవితానికే గొప్ప వరం... !
  చీకూ, చింతా ఎరుగని మీరు 
    హాయిగ ఆనందించేరు... !!!

.  కల్లా, కపటం ఎరుగని... 
              వయసిది.... !
   అందరితో కలసి ఆడేరు... !!

అ ఆ...ఇ ఈ  అంటూ మీరు 
        చిలుకల్లా పలికేరు... ! 
బడి దుస్తులలో..... మీరు 
    బుడి - బుడి  అడుగుల
      పింగ్విన్ పక్షులె అయ్యేరు!!  
            
అరవిరిసి

న పువ్వుల్లా.... 
    నిర్మలంగా నవ్వేరు... !
 ముద్దు - ముద్దు మాటలతో 
     ఎంతో ముచ్చటగొలిపేరు !!

బాలల్లారా  మీ బాల్యం... 
   జీవితానికే గొప్ప వరం !
చీకూ, చింతా ఎరుగని మీరు 
   హాయిగ ఆనందించేరు "!
      *****
కామెంట్‌లు