సుప్రభాత కవిత ; -బృంద
తీరానికి అలల పలకరింపులు
ఆత్మీయ కరచాలనాలు
తోసుకొచ్చే జ్ఞాపకాలు
మరపు రాని మమతలు

మమతల తోటలో
ప్రేమ సీతాకోక చిలుకలల్లే
సందడిగా తిరిగే కొండగాలి

తీగతల్లికి జాగర్తలు
సుమబాలలతో వేళాకోళాలు
పరిమళాల సంగ్రహింపులు

పూలగంధాల పొట్లాలు
వీపున మోసుకుని 
అవని కిచ్చిన పరిమళింపులు

ప్రేమనిండిన మనసుకు
ఇవ్వడం తెలిసిన  మనిషికి
జగమంతా సొంతమే!

సంతోషమనే రెక్కలతో
గగనాల అంచుల తాకాలని
క్షణక్షణమూ ఉత్సాహమే!


ఆనందం అందరితో కలిసి
పొందాలనిపిస్తే 
అదే మానవత్వం

సంతోషం ఎల్లెడలా ఒకేలా
తొణికిసలాడేలా చూస్తే
అదే బ్రతుకు సత్యం

పుడమి ముంగిట 
వెలుగురేఖలముగ్గులు తీర్చే ముచ్చటైన  ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు