శ్రీ శివపద ధ్యానము; - శంకర ప్రియ., శీల., సంచార వాణి: p99127 67098
🚩ఓం నమఃశివా! - నమఃశివా యోం!
శివ!భవ! మృడ!హర! - భవమృడ! హర! శివ!

🪷శివా! నీపదము - ధ్యానింతు మెపుడు!
సమస్త శుభములు - కలిగించు స్వామి! 
🌻భవా! నీపదము - పూజింతు మెపుడు!
భోగ భాగ్యములు - ప్రసాదించు స్వామి!

🚩 ఓం నమఃశివా! నమఃశివా యోo!
 శివ!భవ! మృడ!హర! - భవ!మృడ! హర!శివ!

🪷మృడా! నీపదము - కీర్తింతు మెపుడు!
శాంతి సౌఖ్యములు - కలిగించు స్వామి!  
🌻హరా! నీపదము! - స్మరియింతు మెపుడు!
కష్ట నష్టములు - తొలగించు స్వామి!

🚩ఓం నమఃశివా! - నమఃశివా యోo!
శివ!భవ! మృడ!హర! - భవమృడ! హర!శివ!

      🕉️ నమః శివాయై నమః శివాయ!

కామెంట్‌లు