కందం:
*మండలపతి దండార్హుల*
*దండింపక యుండరాదు ధారుణి నాత డా*
*ఖండల సమానుడైనను*
*మెండగు పాపంబునొంది మెలగు కుమారా !*
తా:
కుమారా! రాజు, దండనాయకుడు ( ఈనాటి పోలీసు వ్యవస్థ) శిక్షకు అర్హులైన వారిని శిక్షింప కుండా ఉండకూడదు. ఇలా, శిక్షార్హులైన వారిని శిక్షింపకుండా ఉన్న రాజు, దండనాయకుడు ఇంద్రునితో సమానమైన వారైనా సరే ఈ భూమి మీద అత్యంత పాపములను మూట కట్టుకున్న వారు అవుతారు........... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*దండించవలసిన వారిని దండనకు గురి చేయకుండా వదలి వేస్తే, సమాజంలో దండనాయకుల వ్యవస్థ (పోలీసు వ్యవస్థ) పట్ల నిర్లక్ష్యం, నమ్మకం పెరిగిపోతుంది. మనం ఏమి చేసినా, ఎంత చెడ్డపని చేసినా మనల్ని ఎవరూ, ఏమీ చేయరు, అనరు అనే నిర్ణయానికి వచ్చేస్తారు. ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వ్యాప్తి చెందితే, సమాజంలో అందరికీ అన్యాయం జరుగుతుంది. అలాగే, తమ పొరపాటు, తప్పు లేకపోయినా కూడా అమాయకత్వం తో ఇరుక్కునే వారిని కూడా దండనకు గురికాకుండా కాపాడగలగాలి. ఎందుకంటే, సహజ న్యాయ సూత్రాల ప్రకారం, ఒక నిందితుడు తప్పించుకున్నా ఫరవాదులేదు కానీ, అమాయకుడు దండనకు గురి అవకూడదు. ఇటువంటి సమాజం మనకు అనుగ్రహించాలని........ కలియుగ ప్రత్యక్ష దైవం, అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి