యువతి మదన;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 కొంతమంది తుంటరులు తన 
అందాన్ని, ఆకారాన్ని చూసి ఎన్నో రకాలుగా బాధ పెడుతూ ఉంటారు. అలాంటి సందర్భాలలో తన మనసును తల్లికి చెప్పుకోవడానికి  వీలు ఉండదు, చెప్పలేదు కూడా.  చెప్పినందువల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయో అన్న ఆలోచన  చెప్పడానికి అంగీకరించదు. తన మనసు ఆ పిల్ల మనస్తత్వం చిన్నప్పటి నుంచి తెలిసిన తల్లికి ఆమె మానసిక క్షోభ  పరోక్షంగా అర్థం చేసుకోగలదు తెలిసి మాట్లాడినట్లుగా కాక ఆ కన్నతల్లి ఎంతో లౌక్యాన్ని ఉపయోగించి అమ్మా ఇలాంటి వయసులో ఇలాంటి ఆలోచనలు నాకు వచ్చాయి.  ఆ వచ్చినప్పుడు మనస్సును  అధీనంలో ఉంచుకోవాలి  ఇది ప్రేమ, ఆకర్షణ అనేది తెలియని వయసు. ఇలాంటివి జరగడానిక అవకాశం ఉంది  మగవారు అనేక రకాల మాయమాటలు చెప్పి మోసగించడానికి ప్రయత్నం చేస్తారు.  వాటిని నమ్మి మోసపోవద్దు  తర్వాత జీవితం సర్వనాశనం అయిపోతుంది  నీ ఆనందం నీ చేతిలోనే ఉంది  దానిని జాగ్రత్తగా కాపాడుకో అని హితవు చెప్పినట్లయితే ఆ పిల్ల ఆలోచించి  చెడు మార్గం వైపు నడవకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది  అది తల్లి బాధ్యత. ఏ స్త్రీకి అయినా  పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టి  వారిని పెంచడం మొదలు పెట్టినప్పటి నుంచి  పిల్లల వల్ల మానసిక క్షోభలను అనుభవిస్తారు తప్ప  సుఖాన్ని అనుభవించనియ్యరు. అది పూర్వ జన్మ కృతం కావచ్చు  ప్రేమ పరాకాష్ట కావచ్చు.  వాడికి ఉద్యోగం వచ్చింది  దానికోసం  శిక్షణ తీసుకోవలసిన అవసరం ఉంటుంది  నాలుగైదు నెలలు తల్లిదండ్రులకు దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది  అప్పుడు ఆ తల్లి మనసు ఎలా ఉంటుంది  దుఃఖం తప్ప  మరో ప్రత్యామ్నాయం లేదు  తన భవిష్యత్తును కాదని  వాడి ప్రయాణాన్ని ఆపలేదు  వాడు వెళ్లిన తర్వాత ఇన్ని రోజులు ఎలా గడపాలా అన్న మదన  బాధిస్తూ ఉంటుంది  చంటి పిల్లవాడి దగ్గర నుంచి ఆ క్షణం వరకు వాడు చేసిన పనులను  చిలిపి పనులను మంచి పనులను  జ్ఞాపకం చేసుకుంటూ కాలక్షేపం చేయాలి.


కామెంట్‌లు