ఆ నూతన వధువు పట్టిన పట్టు విడవకుండా పాటికి పదిసార్లు చెప్పుతూ విసిగిస్తున్న పరిస్థితిని అర్థం చేసుకొని అమ్మ ఏకాంతంగా కూర్చున్న సమయంలో ఓ రోజు అమ్మా నన్ను ఇంతవాడిని చేసావు మరి కోడలు కూడా వచ్చింది ఆమెకు నీ ప్రవర్తన నచ్చడం లేదు తన ప్రవర్తన మార్చుకోదు నీవు ఏమీ అనుకోకుండా వేరే ఇంట్లో ఉండమ్మా అన్ని ఖర్చులు నేనే చూసుకుంటాను నాకోసం, నా జీవితం కోసం నీవు ఏం ఖర్చు చేశావో అది మొత్తం ఒకేసారి చెల్లించే స్తోమత కలిగి ఉన్నాను ప్రస్తుతం. కనుక నా మాట కాదనకు అన్న కొడుకు మాటలు అర్థం చేసుకున్న కన్న తల్లి అలాగే రా నేను ఖర్చు చేసింది మొత్తం ఎంత అని లెక్క చేయడానికి సమయం పడుతుంది కదా రెండు మూడు రోజుల్లో నీకు చెబుతాను అంటే సరే అని ఆనందించాడు భార్యకు చెపితే ఆమె ఎగిరి గంతేసింది.
ఆ రోజు రాత్రి కొడుకు బాగా నిద్రలో ఉండగా ఓ గ్లాసుడు నీళ్లు వాడి పక్క మీద పోసింది అతనికి మెలకువ వచ్చింది ఏమిటమ్మా ఈ పిచ్చి పని అలా నిద్ర చెడగొట్టావు అని విసుక్కొని తడిసిన దుప్పటి కూడా తీసి వేసి కొత్తది వేసుకుని మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తే ఈసారి రెండో పక్క మళ్ళీ నీళ్లు పోసింది తల్లి మళ్లీ అదే రభస ఏమిటి ఈ పనులు అని నిలదీస్తే అప్పుడు చెప్పింది తల్లి నీవు పసి పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను బాగా నిద్రావస్తకు వెళ్లి మంచి నిద్రలో ఉండగా నీవు ఒకటికి వెళ్లేవాడివి పక్క బాగా తడిచేది లేచి ముందు నిన్ను శుభ్రంగా తడి లేకుండా తుడిచి ఆ తర్వాత పక్క బట్టలు మార్చే దాన్ని ఆ చాకిరికి నిద్రా భంగానికి ఎంత విలువ కడితే బాగుంటుందో బాగా ఆలోచించు ప్రస్తుతం నీవు అనుభవించావు కదా దాని విలువ ఎన్ని రూపాయలతో లెక్క పెడతావ్ అలా పెంచి పెద్ద చేసి నీవు చేస్తున్న ప్రతిదాని నీ సంరక్షించుకుంటూ నీ మీద మాట పడకుండా నీవు తప్పు చేసినా నిన్నే సమర్థించుకుంటూ వచ్చిన నాకు ఎంత పరిహారాన్ని చెల్లించ గలవు రా నాన్న ఆలోచించి ఆ విలువ నీవే నిర్ణయించు. ఆ మాట విన్న పుత్రునికి జీవితమంతా ఒక్కసారి జ్ఞాపకం వచ్చి అమ్మ చేసిన ప్రతి పనిని గుర్తుతెచ్చుకొని ధారాపాతంగా దుఃఖిస్తున్న కొడుకుని తాను ఓదార్చి ఒడిలో పండుకోబెట్టి నువ్వేమీ బాధపడకునాన్నా నీవు చెప్పినట్టుగా నీ భార్య కోరికతో నేను వేరే వెళ్లి కాపురం పెట్టుకుంటాను నీవు నాకు ఒక పైసా కూడా ఇవ్వనవసరం లేదు నా రెక్కలను నేను నమ్ముకున్నాను జీవితంలో ఇంకా కష్టపడగలను కనక నీవు ఎప్పుడు నన్ను బయటకు పంపినా నేను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను నీ భార్యకు ఈ మాటలు చెప్పు చాలా ఆనందిస్తుంది అనగానే కట్టలు తెంచుకున్న దుఃఖం కొడుకు నోట మాట రానివ్వలేదు దొంగ చాటుగా వింటున్న కోడలు అత్త కాళ్ళ మీద పడి క్షమించండి అత్తగా కాకుండా ఈ క్షణం నుంచి మిమ్మల్ని అత్తగా కాకుండా అమ్మ గానే చూసుకుంటాను నాకు తెలిసి చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసుకుంటాను అని దుఃఖాశ్రువులతో చెప్పినప్పుడు ఆ తల్లి మనసు కరిగి వారిని ఓదార్చింది అదీ నిజమైన అమ్మ మనసు అలాంటి అమ్మ దొరకటం ప్రతి పుత్రుడికి భగవంతుడు ఇచ్చిన వరం కాదా పెద్దలు ఆమెను ఎందుకు పూజించమన్నారో అర్థం చేసుకుంటే వారి జీవితం ధన్యమవుతుంది. అందుకే ఈ ఉదాహరణ చెప్తున్నాను మీ మనసులు కష్టపెడితే నన్ను క్షమించండి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి