జగతిలో ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో ఒక్కొక్క దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ఎన్ని జిల్లాలు గ్రామాలు ఉన్నయో చరిత్రకారుడు తప్ప మరెవరు చెప్పలేరు. ఈ జగతిలో ఎక్కడైనా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వాతావరణ పరిస్థితులు నెలకొని ఉంటాయి దాదాపు మిగిలిన అన్ని దేశాలలోనూ ఒక భాష మాట్లాడేవారే ఉంటారు కనుక ఒకరితో మరొకరికి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉండదు అందరూ ఒకే దైవ స్వరూపాన్ని నమ్మి కొలుస్తూ ఉంటారు కనుక ఆ ప్రాంతాలలో కులాల పేరిట మతాల పేరిట కుమ్ములాటలు జరగవు దానికి అవకాశం లేదు కారణం అందరూ నమ్మినది ఒకే సిద్ధాంతం కనుక దానిని అనుసరిస్తూ ఉండడం ప్రధాన కారణం కనుక ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ దేశాలలో అందరూ ఒకే దేవుని పూజిస్తారు గనుక ఆ దేవుని ఆకారం ఒకే రకంగా ఉంటుంది. రకరకాల ఆకారాలతో రకరకాల పేర్లతో భగవంతుడు ఆ ప్రాంతాల్లో ఉండదు భిన్న మనస్తత్వాలకు అవకాశం లేని దేశాలు అవి భారతదేశంలో మాత్రం భిన్న సంస్కృతులు ఒకరి భాషకు మరొకరి భాషకు సంబంధం ఉండదు ఎవరి భగవంతుడు వారికే ఉంటాడు కనుక మానసికంగా ఒకరంటే ఒకరికి పగలు కొట్లాట్ల లాంటివి సహజం దానికి తగ్గినట్లు దొంగ వేషాలు వేసేవారు కొందరు ఉంటారు ఏదో భవవంతుని వేషాలు వేసే వాడే ఆ భగవంతుణ్ణి చెప్పుకుంటూ అది చేయగలను ఇది చేయగలను అంటూ తనను గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు నిజానికి భగవంతునికి అన్ని రూపాలు అన్ని నామాలు ఉన్నాయా అన్నది వేమన ప్రశ్న. నేను ఈ దేశంలో సాక్షాత్కరిస్తాను మరొక దేశంలో మరొక రకంగా కనిపిస్తూ ఉంటాను అంటూ రకరకాల పేర్లతో రకరకాల వేషాలతో మోసాలు చేయడానికి వచ్చేవాడు నిజానికి భగవత్ స్వరూపం తెలియని వాడై ఉండాలి అయితే కొంతమంది ఈ కార్యక్రమానికి ఎందుకు ఒడిగడుతూ ఉంటారు అనేది సామాన్య మానవుని ప్రశ్న దానికి సమాధానం ఎవరు చెప్పగలరు అతను పుట్టుకతో దరిద్రుడీ ఉండవచ్చు తినడానికి తిండి లేక కట్టడానికి బట్టలేక నానా అవస్థలు పడుతూ ఉండి ఉండవచ్చు కనుక ఏదో మాయమాటలు చెప్పి జనాన్ని మోసం చేస్తే విపరీతంగా ధనాన్ని సంపాదించవచ్చును అన్న కోరికతో ఇలాంటి పనులకు పూనుకుంటూ ఉంటారు అని వేమన సమాధానము చెప్తున్నాడు. తార్కిత దృష్టితో చూస్తే ఇది నిజం అనిపించక మానదు ఆ పద్యాన్ని చదవండి.
"దేశ వేషములను తేట సేయక దేవుడాత్మలోన నుండు ననగి పెనగి వేసమరసి చూడ గ్రాసంబుకొరకయో..."
"దేశ వేషములను తేట సేయక దేవుడాత్మలోన నుండు ననగి పెనగి వేసమరసి చూడ గ్రాసంబుకొరకయో..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి