చీకటిలో దీపం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ప్రతిరోజు చీకటి వెలుగు కలగలిసే ఉంటాయి. వెలుగు ఉన్న సమయంలో మనకు ఏ వస్తువు ఎక్కడ ఉన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది.  ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే అంతవరకు కూడా ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు మనకు అవసరం అవుతూనే ఉంటుంది. ఏ స్థలంలో ఆ వస్తువు ఉన్నది  దానిని తీసుకొని తనకు కావలసిన పని చేసుకుని ఆ తర్వాత  ఆ వస్తువును ఎక్కడ తీశామో అక్కడే పెట్టినట్లయితే  చూడడానికి అందంగానూ ఉంటుంది. మనసులో ఇది ఫలానా చోట ఉంది దాని అవసరం వచ్చినప్పుడు అక్కడ తీసుకోవచ్చు అన్న అభిప్రాయం స్థిరంగా ఉంటుంది  అలా కాకుండా చిందరవందరగా  ఎక్కడపడితే అక్కడ తన పని పూర్తికాగానే ఆ వస్తువును  పడవేస్తే  అన్ని వస్తువుల్లోనూ ఆ వస్తువు ఎక్కడ ఉందో మళ్ళీ వెతుక్కోవాలి.
మానవ శరీర నిర్మాణం అద్భుతంగా ఉంటుంది  ఏ సిద్ధాంతానికి అనుగుణంగా నీవు చెప్పదలుచుకుంటే దానికి తగినట్లుగానే  ప్రతి అవయవం  ఉంటుంది కదా మానవుడు  తన నిత్య కృత్యాలను సక్రమంగా చేసుకుని దానికి తగ్గ ఫలితాన్ని అనుభవిస్తూ  ఆనందంగా ఉండడానికి జీవితం. అసలు జీవితం అన్న శబ్దమే అద్వైతం శంకరాచార్యుల వారు ఈ సిద్ధాంతాన్ని  రుజువు చేశా  జీవి ఈ ప్రపంచంలో బతకడం కోసం వచ్చింది  ఏదో ఒక స్త్రీ యోనిలో ప్రవేశించి అక్కడ 9 నెలలలో శరీరాన్ని పూర్తిగా ఏర్పాటు చేసుకుని ఈ భూమి మీదకు వస్తుంది  ఆ లోపల జీవి ఉంది ఈ బయట తనువు ఉంది జీవి తన ప్రయోజనాలను తనువు ద్వారా చేసుకోవడం జీవితం  చూడడానికి రెండు రెండుగా కనిపిస్తాయి  కానీ ఉన్నది ఒకే పదార్థం మానవుడు.
అలాగే జీవిత అన్వేషణలో  భగవంతుని కోసం ప్రయత్నం చేసే వ్యక్తి  నిత్యము మనసుతో  తదేకంగా దైవాన్ని దర్శించుకోవాలన్న కోరికతో ఉంటే  సాధన వల్ల దానిని తప్పకుండా  సాధిస్తాడు. అతను దేవుడే అని తెలిసిన తరువాత ఇంక శరీరంతో సంబంధం ఏముంది దానిని గురించి ఆలోచించడం మానివేస్తాడు  మనం చీకటిలో ఉన్న వస్తువుని వెతకడం కోసం  ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి  దాని ద్వారా ఆ వస్తువు ఎక్కడ ఉందో తెలుసుకుంటాం  లేకపోయినట్లయితే  టార్చ్ లైట్ ఆధారం చేస్తాం  ఆ వస్తువు కనిపించడం తరువాత కూడా  ఆ దీపాన్ని పట్టుకొని చుట్టూ వెతుకుతూ ఉండడం ఎంత వెర్రి పని అని ప్రశ్నిస్తున్నారు  వేమన  ఆయన అనుభవంతో దానిని సాధించాడు కనుక  చెప్పే అధికారం ఆయనకే ఉంది  మరి ఆ పద్యాన్ని చదవండి.

"సొమ్ము దొరుకు దనుక యంతియే కాక సొమ్ము దొరుకు వెనుక జ్యోతి 
యేలా  
దేవుడైన వెనుక దేహంబు అదియెలా..."


కామెంట్‌లు