నిన్నన్నది కల;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 కాల గమనం చాలా విచిత్రంగా ఉంటుంది  అది ఎవరికోసము ఆగదు  ప్రతిక్షణం తన కర్తవ్య నిర్వహణలో ముందుకు వెళుతూనే ఉంటుంది  దీనిలో ప్రత్యేకించి మానవునికి  గతం వర్తమానం భవిష్యత్తు అని మూడు రకాల  పద్ధతులు ఉన్నాయి  ఇవి కూడా స్థిరంగా ఉంటాయా అంటే చెప్పలేం  అనుక్షణం మారుతూనే ఉంటాయి. ఈ క్షణం మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్న  సమయాన్ని మనం వర్తమానం అంటున్నాం  ఒక మాట మాట్లాడి మరో మాట మాట్లాడిన  మరుక్షణం అది గతంలోకి వెళ్ళిపోతుంది  మనం మాట్లాడబోయే భవిష్యత్తు  వాణి వర్తమానం అవుతుంది. ఇలా వాటి స్థానాలు అని మార్చుకుంటూ  మానవునికి వింత పద్ధతిలో కనిపిస్తూ ఉంటాయి  మానవునికి ఈ కాలాలకు సంబంధం ఏమిటో దాని గురించి వేమన చెప్పిన విషయం. మానవుడు ఉదయం లేవగానే  నిన్న మొన్న ఏం చేశాం  ఆ చేసినదానిలో ఏమైనా కొరవ  మిగిలిపోయినది ఉన్నదా  దానిని ఎప్పుడు ఎలా  చేయాలి అని దాని గురించి ప్రణాళికా బద్ధమైన ఆలోచన చేస్తూ ఉంటాడు. గొప్ప వేదాంత శిరోమణి ఒమర్ ఖయ్యాం నిన్న అన్నది గతించే  రేపు అన్నది కలదో లేదో  నేడు అన్నది నిజం ఉన్నది అనుభవించు, ఆనందించు అంటూ తనకు  మదిర అందిస్తున్న సాఖీతో  (ప్రేయసికి) చెప్పిన మాట  తాగినవాడు చెప్పినది అని తీసిపారేయలేము  ఆయన చెప్పిన ప్రతి అక్షరం  స్వచ్ఛమైనది నిత్యమైనది  అందుకే వారి పేరు ప్రపంచ దేశాలన్నీ  చెప్పుకుంటూ ఉంటాయి  వేమన కూడా దాని గురించి అద్భుతంగా చెప్పారు  ఆయన ఏమంటాడంటే గతాన్ని గురించి ఆలోచిస్తూ  నిన్న మొన్న ఆ క్రితం జరిగిన ప్రతి విషయం కలలాంటిదే  అలా చేసాను ఇలా చేసాను అని భ్రమలలో ముందుకు సాగుతాడు తప్ప అవేవీ నిజాలు కావు  ఇవాళ వర్తమానంలో జీవిస్తున్నాం.  దీనిని నమ్మగలవా ఏ క్షణాన  పరిస్థితులు మారి నీకు ఎలా ఉంటుందో  కాలం తప్ప నీవు నిర్ణయించలేవు  కనుక దాని గురించి  ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు  రేపు జరగబోయే దాన్ని భవిష్యత్తు అంటున్నారు కదా  భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు చేస్తావు అలాగే చేద్దాం అని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాం  కానీ అవన్నీ కార్య రూపం దాలుస్తాయి అన్న నమ్మకం లేకుండా  అలాగే సంసారమే సర్వస్వం ప్రతిక్షణం నేను సుఖాన్ని పొందుతున్నాను అన్న ప్రేమతో కాకుండా  జీవితాన్ని ఆధ్యాత్మికంగా ఆలోచించండి అని చెప్తున్నాడు వేమన  ఆ పద్యం చదవండి.

"గతము జూదమంటె కలగన్న వ్యర్థంబు 
నడుచు కాలమేమి నమ్మరాదు  క్షణములోన బ్రతుకు సంసార విభ్రాంతి..."


కామెంట్‌లు