మనసు అజ్ఞానం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
ఈ సృష్టిలో వింతలకెల్ల వింత మానవుడు  తాను  ఈ భూమి మీదకు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు  తన వాడెవడు వాడికి నాకు సంబంధం ఏమిటి  నా కర్తవ్యం నేను చేయవలసిన పని ఏమిటి  పనిచేసి కడుపు నింపుకొని  హాయిగా విశ్రాంతి తీసుకుని కాలం గడపడం ఇదేనా ఇంతకుమించి మరేదైనా సాధించవలసినది ఉన్నదా  దానిని ఎలా సాగించాలి ముందు నేను అన్నది ఎవరో తెలియాలి కదా  దానికోసం ప్రయత్నం చేసి అది తెలిసిన తరువాత మిగిలిన వాటిని తెలుసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి ప్రయత్నం చేస్తే  తానెవరో తనకు తెలుస్తుందా  అతని శక్తి ఎంత  తెలుసుకోవడం కోసం అతని చేసే ప్రయత్నం ఎలాంటిది  దాని మార్గమైనా తెలుసా  ఏమీ తెలియకుండా ఏం చేయగలడు. ఇది నా మొహము అని చెప్పుకో గలడు తప్ప దానిని చూడగలడా  నాకు చెవులు ఉన్నాయి  దానివల్ల ఎవరు ఏది చెప్పినా వినిపిస్తుంది ప్రతి శబ్దం నాకు తెలుస్తుంది అనుకోవడం తప్ప  తన చెవిని తాను చూడగలడా  వీపును నిమిరి ఇది వీపు అని చెప్పడం తప్ప  తన కళ్ళతో చూసే శక్తి కలగా  శరీరం మొత్తానికి కావలసినది తల  అది లేకపోతే ఆలోచనలకు వస్తే ఏమీ లేదు  పంచేంద్రియాలు పనిచేయడానికి అది ముఖ్యం. కనీసం అంత ముఖ్యమైన తలనైనా చూడగలడా  పోనీ తల మీద ఉన్న శిరోజాలు ఉన్నాయి కదా  దాని రంగు మారిపోతే చూసి గ్రహించగలడా?  అది కూడా ఇతరులు చెప్పాలి  తలను నిమిరి ఇది నా జుట్టు కొనుక్కోవడం తప్ప  శరీరం  మానవుడికి ప్రసాదం  అందరూ చూస్తున్న విషయాన్ని తాను చూడలేకపోవడం  వింతలలో వింత కాదా. అలాంటి అజ్ఞాని  అసమర్థుడు  తనలో అంతర్గతంగా ఉన్న తనను  తెలుసుకోలేని వాడు దాని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే  జీవితం మొత్తం తపస్సు చేసినా దాని పూర్వాపరాలు తెలుసుకోగలడా  తత్వము అంటేనే  శాశ్వతముగా ఏదైతే ఉన్నదో అది నేనేను  అని చెప్పేది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు  సామాన్య విషయాలను  చెవినిపెట్టలేనివాడు  శాశ్వతమైన విషయాన్ని తెలుసుకోవడం  అతని వల్ల అయ్యే పని అవ్వదా ఎంతమంది గురువులు బోధించిన ఆ  బోధనలలో ఉన్న  రహస్య విషయం అర్థం అయితే కదా  దాని గురించి ప్రయత్నం చేయడానికి  కనుక జీవితమంతా అజ్ఞాని గానే ఉండిపోతాడు అని  వేమన  తేల్చి చెప్పిన విషయం  ఆ ఆటవెలదిని ఒక్కసారి మననం చేయండి.

"కానలేడు నుదురు కర్ణముల్ వీపును 
నుదురుగానలేడు నెత్తిమీద  తన్ను గాన లేడు తత్వమేమెరుగును..."


 

కామెంట్‌లు