వందే వందారు మం దారం...! ;- శంకర ప్రియ., శీల., సంచార వాణి: 99127 67098
 🪷 వందనము వినాయక! 
       వరసిద్ధి వినాయక!
       బుద్ధి ప్రద వినాయక!
                ఓ విఘ్న రాజ! 
🪷 భక్తజన మందార! 
      ఇందిరా మనోహర! 
      నమస్తే విఘ్న హర!
            ఓ విఘ్న రాజ! 
      ( విఘ్న రాజ పదాలు., శంకర ప్రియ., )
👌శ్రీ మహా గణపతి.. విశిష్ఠ లోకైక నాధుడు! సర్వ స్వతoత్రుడు. అందు వలన, "తనకు మరొక ప్రభువు లేనివాడు" ! కనుక, "వి నాయకుడు"!  గజాననుడు... దుర్మార్గులను శిక్షించు వాడు! విఘ్నములను తొలగించువాడు! కనుక, "వి  నాయకుడు"! అట్లే, సన్మార్గులను రక్షించు వాడు! విజయములను కలిగించు వాడు! కనుక, "వి నాయకుడు".. సార్ధక నామధేయుడు! 
👌శ్రీ లక్ష్మీ గణపతి... ఐశ్వర్య ప్రదాత! ఇష్ట కామ్యము లను నెరవేర్చు "కల్ప వృక్షము" వంటి వాడు! శ్రీస్వామి వారిని... "కనకధారా స్తవము" నందు.. ఈ విధంగా మంగళా చరణము కావించారు, జగద్గురు శంకర భగవత్పాదుల వారు!
 🔱వందే వందారు మందారం
    ఇంది రానంద కందళం!
    అమందానంద సందోహ
    బంధురం! సింధురాననం!!
 👌శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు... రెండు చేతులను జోడించి, నమస్కరించే భక్త మహాశయులకు.. కోరికలు తీర్చే కల్పతరువు! ఇందిరాదేవి యనబడు శ్రీదేవికి ఆనందాన్ని కలిగించేవాడు. సింధూర వర్ణముతో, ఏనుగు ముఖముతో విలసిల్లువాడు! అటువంటి వినాయకునకు భక్తి ప్రపత్తి లతో నమస్కార శతములు!
        🚩ఉ త్పల మాల వృత్తం 
     వంది జనంబు లిష్టములు వైళమ పొంద సుర ద్రుమంబవై 
     యిందిర మానసంబు నలరించెడు ముద్దు మొగంబుతో సదాz
      నంద సుబంధు రోన్ముఖ వినాయక! సుందర సింధురే ణ్ముఖా! 
       వందనముల్ గ్రహించుమ! శుభాల, జయాల ననుగ్రహించు మా!!
( "కనకధారా స్తవము"  తెలుగు సేత: వెలుదండ సత్య నారాయణ., పరమార్థ కవి., )

కామెంట్‌లు