సుప్రభాత కవిత ; -బృంద
మణి కిరీటపు మెరుపులు
మిరుమిట్లు గొలుపుతూ
మింటినిండ వెలుగు 
కిరణాలు ప్రసరింప

ఉదయాద్రి  వేదికగ
గగన  కనక వీణ మీద
భూపాలములు మోహనముగ
మ్రోగుచుండగా....

భువనములు హరితవర్ణ
పీతాంబరము ధరియించి
నీహారికా ముత్యముల
దోసిళ్ళ పట్టి  దిగదూడ్చ వేచె

చిన్ని పువ్వులు పొత్తిళ్ళలో
పీయూష బిందువులు దాల్చి
దినరాజుకు నైవేద్యమిడ
భక్తిగా  కేలు జోడించి  నిలిచె


మధువనిలో విరిసిన
మనోహరమై

న విరుల
మకరందాల ధారలో తడిసిన
మధుప బృందాల మధుగీతాలు

మధూదయపు మంగళకర
మధురభావనల  తడిసిన 
మదిని మించిన మధురమున్నదా
మహిని??

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు