చిట్టి ఉడుత పొట్టి పాప;- ఎడ్ల లక్ష్మి
ఊరు ఊరు తిరిగి ఉడుత పిల్లా
మా ఊరికొచ్చినవా ఉడుత పిల్లా
ఊరి పక్కన ఉన్నది ఊడుగు చెట్టు !!

చెట్టు మీద ఎక్కినవా ఉడుత పిల్లా
చెట్టుకున్న పండ్లన్నీ ఉడత పిల్లా
పొట్ట నిండా తిన్నావా చిట్టి ఉడత !!

పండ్లన్నీ తిన్నాక నీవు ఉడత పిల్లా
ఆటలేము ఆడుతూ ఉడుత పిల్లా
అరటి చెట్టు ఎక్కినావా చిట్టి ఉడత !!

దారిలోకి దూకినావా ఉడుత పిల్లా
పరుగు తీసి ఉరికుతూ ఉడత పిల్లా
పాప చూపులోన చిక్కావు చిట్టి ఉడత !!

పాపా అల్లరి ఆగింది ఉడుత పిల్లా
నిన్నే చూస్తూ ఆడుతుంది ఉడుత పిల్లా
పొట్టి పాపతో నీ ఉండిపో చిట్టి ఉడత !!


కామెంట్‌లు