ఒత్తిడి! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివా  అతని తల్లి పరీక్షల ఒత్తిడి తో  అతలాకుతలం అవుతున్నారు.తల్లి టీచర్!బడిలో రిజల్ట్ సరిగ్గా రాకపోతే ఆమె ఉద్యోగం ఊడుతుంది.అసలే మేనేజ్మెంట్ స్కూల్. తను ఎం.ఎ.బి.ఇడి చేసినా ఏమిలాభం?ఈఏడాదే కొత్తగా చేరింది. నైన్త్ టెన్త్ క్లాసులు 6పీరియడ్స్ నించునే పాఠం చెప్పాలి.కొడుకు శివాది సెంట్రల్ సిలబస్!వేరే టీచర్ దగ్గరికి నెలకీ 2వేలు ఇచ్చి ట్యూషన్ పెట్టించింది.భర్త పోవటంతో అన్నీ తనే చూసుకోవాలి. అపార్ట్మెంట్ తాత గారు ఓరోజు అన్నారు "అమ్మా జయా! శివా నీవు రోజూ గుడికి వెళ్లి రావిచెట్టు కింద  ఓపావుగంట ఉదయం సాయంత్రం గడపండి.మనసులో టెన్షన్ పోతుంది. దైవప్రార్థన తో మనసు నిర్మలంగా ఉంటుంది. " అనటంతో రోజూ అలా ఇద్దరు వాకింగ్ తోపాటు మనసు ప్రశాంతంగా ఉంది.  పాజిటివ్ గా ఆలోచించాలి. బాబోయ్ అని ముందే గగ్గోలు పెట్టరాదు.ప్రకృతి పరిశీలన తో మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే పూర్వం గుడిగోపురాలు ఊరికి దూరంగా ఉండేవి 🌹
కామెంట్‌లు