సుప్రభాత కవిత ; - బృంద
నదికి కడలి చేరుకునే దారి
తెలిసినట్టు..
కాలానికి గమ్యం  చేర్చే దారి
తెలుసు.

ఎంత ఎత్తుగా చెట్టు
ఎదిగినా మూలాలు నేలపైనే

ఎత్తు చూసి భయపడితే
కొండ కిందే మనముండిపోతాం

మొదటి అడుగు వేసాకే
గమ్యం వైపు పయనం మొదలవుతుంది.

ఎంత ఎత్తున లక్ష్యం ఉన్నా
చేరు తోవ చేరువవుతుంది

ఎవరి గమ్యం ఎక్కడో
ఎవరి పయనం ఎటువైపో

ఏ విజయాల తీరం
ఎంత దూరమో!

కాలానికి అన్నీ తెలుసు
పదిలంగా గమ్యం చేరుస్తుంది.

ఎవరూ తన వారనుకోదు
అందరికీ తన ఆసరా ఇస్తుంది

అవశ్యంగానో ఆలస్యంగానో
అందమైన ప్రతిఫలం అందిస్తుంది.

అందుకే రేపు  బహుతీపి
ఓపికగా రేయి గడపాలి.

ఎంత మన వంతో
ఏది మన పాలో
అది మనకు వచ్చి చేరుతుంది

మన చేతికి వచ్చినదే అమృతం
అది తెచ్చేదే  ఈనాటి ఉదయం

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు