దాగని నిజాలు;- -గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు.
గడ్డి పోచలను కల్పి పేనితే!
ఏనుగునైనా  బంధించవచ్చు
ఆత్మవిశ్వాసమే పెరిగితే!
విజయ దుందుభి మ్రోగించవచ్చు

పిరికితనం కాసింత ముదిరితే
జీవిత నావ అతలాకుతలం
చెప్పుడు మాటలు విన్నారంటే
కాపురాలిక చిన్నాభిన్నం

నైతిక విలువలు శూన్యమైతే
రాజ్యమేలు గాఢాంధకారం
మానవత్వమే మృగ్యమైతే
దానవత్వమే చేయు విహారం

జరిగిన పొరపాట్లు దిద్దుకుంటే
అవతారోయి!! పుణ్యపురుషులు
క్షమాగుణమే స్వీకరిస్తే
శత్రువులవుతారు మంచి మిత్రులు


కామెంట్‌లు