సప్త పది @- కోరాడ నరసింహా రావు !
ఆశయే... బీజము... 
పేరాశ,దురాశలకు...

  చివరికివియే... నిరాశకు గురిచేసి.. దుఃఖమును      మిగుల్చును...!
     
చనువు పెరిగిన... 
హద్దులను మీరుదుము... !
అనర్ధములకదియే... 
     దారితీయు నుసుమీ...!! 

నిశీధిలోనే... 
నేరములు జరుగును, 
చీకటిపనులేవి.... 
చేయబోకుము  !

పూలరేకుల పాన్పున పరవశించే నీవు... 
   ప్రేయసి ఎద సవ్వడితో    జతకట్టగలవేమో.... !

మనసుకధ లవిఎన్నో.... 
   వినబోకు   నీవు....  
  ఎండమావులవెంట 
   పరుగు తీయుదువు ... !

సద్ బుద్ది   చెప్పిన మాట... 
     వినిపించుకోవయ్య... !
 సజ్జనుడవై... సత్కీర్తి... 
        పొందగలిగెదవు.. !!
      ******

కామెంట్‌లు