ఆగీ..ఆగీ.. తాబేలూ ;- :గంగదేవు యాదయ్య

 ఆగీ..ఆగీ.. తాబేలూ 
ఆగీ.. ఉన్నదీ.. కాబోలూ 
ఆగీ..ఆగీ.. తాబేలూ 
సాగతు ఉన్నది.. కాబోలూ 
ఆగీ..ఆగీ.. తాబేలులూ ....
ఊగుతు ఉన్నది... కాబోలు...
ఆగీ..ఆగీ.. తాబేలూ ...
సాగుతు ఉన్నది.. కాబో లూ 
ఆగీ..ఆగీ.. తాబేలూ ....
అలసి పోయెను..తాబేలూ 
సాగీ.. సాగీ..తాబేలూ ...
సొలసి పోయెను తాబేలూ
చూసీ.. చూసీ తాబేలూ..
ఆలోచించెను తాబేలూ...
రోడ్డుకు మధ్యన తాబేలూ...
నడవను అన్నది తాబేలూ...
రోడ్డుకు మధ్యన తాబేలూ...
ఉరుకను అన్నది తాబేలూ...
గొడవల మధ్యన తాబేలూ...
మనలేనన్నది తాబేలూ...
ఏటి నీటిలో తాబేలూ...
ఎదుగుతనన్నది తాబేలూ...
నదీ నీటిలో  తాబేలూ...
నానుతనన్నది తాబేలూ...
నదీ నీటిలో  తాబేలూ...
ఈదుతనన్నది తాబేలూ....
సముద్రమందునతాబేలూ
సంతసమన్నది తాబేలూ....
సముద్రమందున తాబేలూ...
సంతోషం అన్నది తాబేలూ...
కుర్రో - కుర్రు
========================
( రచయిత " ఉయ్యాల-  జంపాల" పిల్లల పాటలు/ పద్యాల పుస్తకం)
కామెంట్‌లు