మంచి మాట;- కొప్పరపు తాయారు

  చిన్నప్పుడు చిన్న చిన్న మాటలతో మనకి
నేర్పిస్తారు కదా.వాటిలో మనకు కావలసి ఔషధాలు 
కూడా వుంటాయి .
    ఈ చిన్న పాట ఆటలో వాడేదే కానీ దానిలో పదార్థాలు మనకి తెలిసిన వే. చూడండి :
                   కాళ్ళ గజ్జి కంకాళమ్మ
                   వేగు చుక్క వెలగ మొగ్గ
                  మొగ్గ కాదు మోటిక నీరు
                  నీరు కాదు నిమ్మల వాయ 
                  వాయ కాదు వామింటికూర 
                  కూర కాదు గుమ్మడి పండు
                  పండు కాదు పాపాయి కాలు
                   కాలు దీసి గట్టున పెట్టు !!!
    ఈ ప్రకారం అవి వాడితే కాళ్ళ గజ్జి పోతుందని
మనకి మర్చి పోకుండా ఇలా చిన్న గీతం లా అందించారు మన పూర్వీకులు, చాలా చాలా
గొప్పవారు. అందుకే    మనం పెద్దలని గౌరవించాలి,
వారి మాటలు మనం పాటించాలి అని అంటారు
ఎందుకు ?పెద్ధల మాట చద్ది మూట అంటాం అందులో అంత గొప్ప తనం వుంది కాబట్టి 
                    అందుకే నిద్దుర లేస్తూనే దైవ ప్రార్థన
చాలా అవసరం. మంచి చేతలు  మహిమ కలిగినవీ
అవి పాటిస్తే మనకి ఎంతో మంచి కలుగుతుంది.
              మంచిమాట మన్నన పొందుతుంది.మంచి
హృదయం వెన్నెలాంటిది . ఇలాంటి సద్గుణాలు కలిగిన వాడు మన శ్రీ రామ చంద్రుడు.అందుకే
ఆతడు  దైవముగా పూజలు అందు కుంటున్నాడు.
                   మనం కూడా మంచి నడత,మంచి
మాట, మంచి ఆలోచన,,మంచి హృదయం తో
పదిమంది మంచి కోరుకుందాం మంచిని పండిద్ధాం.

కామెంట్‌లు