లాల్ బహుదూర్ శాస్త్రి ;- కొప్పరపు తాయారు

  ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారు తన ఊరు వెళ్లారు. అక్కడ ఆయన వాళ్ళ అమ్మగారికి రైల్వే మంత్రిని అని చెప్పలేదు తల్లికి . ఏమి చెప్పారంటే నేను రైల్వేలో పని చేస్తున్నాను. అని చెప్పారు
               ఆమె కూడా ఆరోజు జరిగిన ఫంక్షన్ కి వచ్చారు వచ్చి ఇక్కడ మా అబ్బాయి రైళ్లల్లో పని చేస్తున్నాడు అందుకు అతని చూడాలి మాట్లాడాలి అన్నారు.
     అక్కడున్నవారు మీ అబ్బాయి పేరేంటి అన్నారు అని అడిగితే వెంటనే ఆమె నా కొడుకు పేరు లాల్ బహదూర్ శాస్త్రి అని చెప్పారు.
       అక్కడ వారంతా ఆశ్చర్యపోయారు అంత పెద్ద ఆవిడ అబద్ధం చెప్తుంది అనుకున్నారు.. అబద్ధం చెప్పకు అన్నారు.
          నాకేం అవసర మయ్యా అబద్ధం చెప్పడానికి అన్నారట.  వచ్చాడయ్యా నాకు తెలుసు ! అని కూడా అన్నారుట.
    వెంటనే వారందరూ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి
దగ్గరకు తీసుకెళ్ళి,ఈయన మీ అబ్బాయా అని అడి
గారట". అవును. అవును ఇతను నాకుమారుడే
అన్నారట.
         వెంటనే జనాలు "ఈమె మీతల్లా ? అన్నారుట.
వెంటనే శ్రీ శాస్త్రిగారు ఆమె వద్దకు వెళ్ళి ఆమె ను 
భుజం మీద చెయ్యి వేసి పట్టుకుని తీసుకొని వచ్చి
తన పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడి తిరిగి ఆమె ని
ఇంటికి పంపారట‌ .
            అప్పుడు రిపోర్టర్స్ అడిగారు మీరు ఎందుకు ఆమె ముందు ఉపన్యాసం ఇవ్వలేదని. దానికి ఆయన మా అమ్మకు నేను మినిస్టర్నని తెలియదు ఇంక తెలిసిందంటేన,అయిన వాళ్ళందరికీ సిఫార్సులు చేస్తే నేను కాదనలేను తను కూడా ఒప్పుకోదు. అందుకేచెప్పలేదు అన్నారట.  ఇప్పుడు కూడా ఒక
ఉద్యోగిగా మాటలాడీ పంపించేసాను అన్నారట.
   అందరికీ పెద్ద విద్యుత్ .షాక్ తగిలింది.ఆ సమాధానం. ఆ నిస్వార్థత ఆ వినమ్రత,  ఆ నిజాయితీ, ఎక్కడ దొరుకుతాయి. అందుకే ఆయన చాలా గొప్పవారు తప్పకుండా ఆయన పద్ధతిలో ఆయన అడుగుజాడల్లో మనమంతా నడవాలి అందరూ.ఆరోజులు పోయాయి  నిజాయితీని కళ్ళనీళ్ళతో  వెతుక్కునే కాలం �
కామెంట్‌లు