వర్షఘోష;- మిట్టపల్లి పరశురాములు
నల్లని మేఘాలు 
దిక్కులుపిక్కటిల్లగా చరచరా!
ఉరుములై ఘర్జిస్తున్నాయి

జడవానలో జగమంత
తడసి పిట్టలా తండ్లాడుతుంది


నలుదిక్కుల సముద్రాలన్ని
ఏకమై
భూమిని ముంచుతున్నాయి

మూగజీవాలన్ని
కుదేలయినయి
గూటిలోని గిజిగాలన్ని
ముసురుజల్లుల భీకరధాటికి
పట్టుదప్పిజారి చెదరి
పోతున్నయి.

మేత కరువైన 
జంతుజాలము
జాగరణ చేస్తున్నాయి     

కుండపోతవర్షానికి
కూలిబతుకులు
వరద ధాటిలో దారి దొరుకని చిరునామ
ఒక్కొక్కరు చెట్టుకొకరు!
పుట్టకొకరు!! చెదరిన తీరు 

వర్ష ఘోష !
మనుగడ కబలిస్తున్ననవేళ
కదంతొక్కి...
చేయిచేయికలిపుదాం
చెదరినగుండెలకు చేయూతనిద్దాం!!


        *


కామెంట్‌లు