సుప్రభాత కవిత ; - బృంద
కొలని నీటిలో ఆటలూ
ఎదనిండి పాడేపాటలూ

కనుచూపు మేరా
కంటికింపైన పచ్చదనం

కాలికింద పట్టులా
మృదువుగా  పచ్చిక స్పర్శ

సుదూర తీరాల 
ఆవరించిన  నిశ్శబ్దం 

దవ్వున వినిపించే
మారుత మురళీ గానాలు

గాలితో పాటుగా
పరుగులు తీసే మనసు

పచ్చని పుడమిని
వెచ్చగ తాకే  లేతకిరణాలు

చేయితిరిగిన చిత్రకారుని
చేతి కుంచె గీసిన చిత్రం

అణువణువూ కలయతిరగాలని
మనసుకెందుకు ఆత్రం?

అందమైన ప్రకృతిలో 
అణువైనందుకు ఆనందం

అందమే ఆనందం
ఆనందమే జీవన మకరందం

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు