" అదీ... ముఖ్యం.... ! "-- కోరాడ నరసింహా రావు.
అక్కసుకు పుట్టిన తిట్లు, శాప నార్ధాలకు భయపడితే.... 
    బ్రతకలేవు  సోదరా..... !

అది... వాళ్ళ ఈర్ష్య - అసూయ లకు పరాకాష్ట.... !
  ఆమాత్సర్యాగ్నికిబలైపోయేది
 వాళ్ళేగానీ, నీకు వచ్చే నష్ట మే మీ ఉండదు... భయపడకు !

ఎవరో...ఏమోఅంటారని....అను  కుంటారని...నీధర్మాన్ని యే 
నాడూ వీడకూడదు సుమా... !

ఎట్టి  సంశయము వద్దు... ! నీ కర్తవ్యనిష్ఠలో నీవెప్పుడూ... 
      సంశయించకు !!

నీ ఆత్మ సాక్షి, కాదన్నదాన్ని ఔ నని... ఔనన్నదాన్ని కాదని... 
 ఏనాడూ ఆత్మవంచన చేసుకోకు... !

లోకమంతా ఏకమై.... 
   ని  న్నొoటరిని చేసినా..... 
      నీవు భయపడకు... !

న్యాయం నిన్ను  పడగొట్టదు... 
నిలబెడుతుంది, ధర్మం నిన్ను గెలిపిస్తుంది.. !

మచ్చలేని మనిషివని చరిత్ర... 
నీవైపు సాక్ష్యం చెబుతుంది !
అ తీర్పు కాంతి, నిన్ను తార ను 
   చేస్తుంది... !!

జన్మకు సార్ధకత ఇదేగా... !
 రేపు మనం పొతే.... 
  అయ్యో... చనిపోయాడా అనే లా బ్రతకాలి... 
   ఆఁ... పోయాడా... పీడ విరగడైంది ! అనేలా చావకూడదు... !!
 
మనిషికి ఏది ముఖ్యం... ?
  ఎన్ని కోట్లు కూడబెట్టామా
 ఎన్ని సుఖ, భోగాలనుభ వించామా..., 
 అని కాదు...., నిజాయతీగా 
ఆత్మ తృప్తితో పో గలిగామా, లేదా... అన్నదే ముఖ్యం !
     ****

కామెంట్‌లు