దేని విలువదానిదే! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివా తన ఇంటి చుట్టూ బిళ్లగన్నేరు కలబంద మొక్కలు నాటాడు.తాత అన్నాడు "ఒరే శివా!పూలమొక్కలు తులసిమొక్కలు లేకుండా ఎందుకురా ఇవన్నీ!?" "తాతా!కలబంద ఆరోగ్యానికి మంచిది. నీటి అవసరంలేదు. మనీప్లాంట్ ఎప్పుడు నిత్యకల్యాణం పచ్చ తోరణంగా ఉంటుంది. పూలమొక్కలకి మంచి ఎరువు కావాలి.సరిగ్గా పోషణచేయాలి.తులసికూడా గింజలు వేస్తే బాగా వస్తుంది. సరిగ్గా మొలవదు.హఠాత్తుగా వాడిపోతుంది. బిళ్లగన్నేరు త్వరగా ఎదిగి తెలుపు పింక్ కలర్లోపూస్తాయి.ఏడాది పొడుగునా పూలతో అందంగా ఉంటుంది. దీని పూలు బ్లడ్ ప్రెషర్కి  మంచిదిట!ఇకమల్లెలు కేవలం వేసవిలోనే పూస్తాయి. బంతి చేమంతి కొన్ని కాలాలకే పరిమితం. ఇంటిచుట్టూ పచ్చదనం ఉండాలి కానీ వాడిరాలే పూలు కొన్ని కాలాల్లో పూసేవి వద్దు.దేని విలువ దానిదే అన్నాడు. 🌹
కామెంట్‌లు