*హనుమాన్ చాలీసా - చౌపాయి 1*
 *శ్రీ శోభకృత, వైశాఖ బహుళ దశమీ, ఆదివారం - 14.05.2023,  హనుమజ్జయంతి శుభాకాంక్షలతో*
*జయ హనుమాన్ జ్ణానగుణ సాగర!*
*జయ కపీశ తిహు లోక ఉజాగర!!*
తా: సముద్రమంత జ్ఞాన సంపదకూ, మంచిగుణములకూ నిలయమైన హనుమంత, నీకు జయమగు గాక. మూడు లోకాలను ప్రకాశింప జేయగల కపిసుందరుడా నీకు జయమగు గాక.....అని ప్రాతః స్మరణీయులు, గోస్వామి తులసీదాసు గారు ప్రార్ధన చేస్తున్నారు.
*భావం: పరామాత్మడు, పరమశివుడి రూపమే అయిన హనుమంతుని దగ్గర తక్కువ అనే పదానికి తావే ఉండదు కదా! ఆయన ఇచ్చేవాడే కదా! ఎల్లప్పుడూ ఇవ్వడానికి సిద్దంగా ఉన్న హనుమ అనబడే ఈశ్వరుని ఎప్పుడు, ఏమి అడగాలి అనే విషయం మనకు తెలియ జేసేది కూడా, ఆ భగవంతుడే, గురువు రూపంలో వచ్చి. ఎందుకంటే, భగవంతుని ఎదురుగా నిలబడి మన కర్మ చక్షువులతో చూడలేము కదా! అందుకని మన జీతాలలో గురువు యొక్క ప్రాధాన్యత. సద్గురు మార్గదర్శనంలో ప్రతీ రోజూ పరమాత్ముని కీర్తించే మంచి లక్షణాన్ని మనకు ఇవ్వమని......ఆంజనేయుని తలపులలో నిత్యం కొలువున్న రామచంద్ర మూర్తిని వేడుకుందాము.*
*ఆఙనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి!*
*తన్నో హనుమత్ ప్రచోదయాత్!!*
*ఆంజనేయ వరద గోవిందా! గోవింద!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
Nagarajakumar.mvs

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం