సంప్రదాయం;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఇవాళ కొన్ని కుటుంబాలను మీరు పరిశీలనగా చూడండి  కొందరు పద్మాసనం వేసుకుని కూర్చుని  అరటి ఆకులలో  వేడిగా అన్నం కూరలు వడ్డించుకుని  చక్కగా భోజనం చేస్తారు మరి కొంతమందికి  నిజానికి చాలామంది ఇండ్లలో  కుర్చీలు మేజాబల్ల సిద్ధంగా ఉంటే భోజనం చేసేవారికి  దాని మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు  కొంతమంది  రెండు కాళ్ళను ప్రక్కకు పెట్టి  కూర్చుని భోజనం చేస్తారు  ఇలా చేయడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది  ఆ భోజనం చేసేవారు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా  ఒకవేళ ఆలోచిస్తే అలా చేస్తారా  అది తప్ప.అది తప్పు అని ఆలోచించుకొని  శరీరానికి మేలు చేసేదైతే తప్పక దానిని అనుసరించి తీరవలసినదే  లేదంటే ఆ పద్ధతిని మార్చుకోవడం ఉత్తమం  లేకుంటే శరీరం రోగాల పాలవుతుంది. ఎవరు ఏ పద్ధతిలో భోజనం చేసినా  ముందు శాస్త్రీయమైన పద్ధతి ఏమిటో తెలుసుకోవాలి  నాభికి దగ్గర ఉన్న  అన్నమయ్య కోశానికి మనం తిన్న అన్నం వెళ్లి అక్కడ స్థిరపడుతుంది  అక్కడి నుంచి జీర్ణ ప్రక్రియ ప్రారంభమవుతుంది  కనుక ఆ భాగాన్ని నాలుగుగా విభజించి రెండు భాగాలు ఘన పదార్థం  ఒక భాగం ద్రవపదార్థం తో నింపి  చివరి నాలుగవ భాగాన్ని గాలి కోసం ఖాళీగా ఉంచాలి  అప్పుడు మనం తీసుకున్నటువంటి ఆహారం  ద్రవ పదార్థాల్లో ఘన పదార్థం కలిసి  రకరకాల మార్పులతో  జీర్ణక్రియకు దోహదపడుతుంది  అలాంటి శరీరం ఏ పరిస్థితుల్లోనూ  రోగగ్రస్తం కాదు  అది జ్ఞాపకం పెట్టుకొని  మీరు ఏ పద్ధతిలో భోజనం చేసినా అది శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది తప్ప చెడును కలుగ చేయదు  దానిని జ్ఞాపకం పెట్టుకోండి.
మన పెద్దలు  శాస్త్రీయమైన పద్ధతిని దృష్టిలో పెట్టుకుని  మనం నిద్ర లేచిన దగ్గరనుంచి  తిరిగి నిద్రకు ఉపక్రమించేంతవరకు చేయవలసిన ప్రతి పనిని నిర్దేశించి  ఏ పద్ధతిలో ఆ పనిని చేయాలి  అని శాసించినట్లుగా మనకు చెప్తారు  లేవగానే ముందు కాలకృత్యాలు తీర్చుకోవాలి  ముఖం కడిగేటప్పుడు పిల్లలకు మనం చెప్పవలసిన  పద్ధతి ఏమిటి అంటే  పిల్లల్ని ఆ పని చేయమంటే వారు  బ్రష్ మీద పేస్ట్ ను పెట్టి  నోటిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అటు ఇటు రెండుసార్లు మూడుసార్లు  తిప్పి  నోటిలో నురుగు చేసుకుని నాలుక పై ఉన్న పాచిని  శుభ్రపరచుకుంటారు.  ఇది సరైన పద్ధతి అని వాళ్ళ  అభిప్రాయం  కానీ అమ్మ వాడికి మొహం ఎలా కడగాలో చెప్పాలి  నిజానికి నేర్పాలి.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం