పాత్రమెరిగి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నలుగురితో కలిసి కాలక్షేపం చేయాలని సరదాగా  మాటలతో కాలం గడపాలనుకున్న వ్యక్తి ఒక రోజు తనకు సన్నిహితులైన మిత్రులను భోజనానికి పిలిచి ఆరోజు  సరదాగా అంతా కలిసి పాత సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆ రాత్రి సరదాగా ఉందాం అనుకొని  వారిని ఆహ్వానించి భార్యతో ఫలానా వాళ్లు ఫలానా వాళ్లు వస్తున్నారు వాళ్ళకు ఇష్టమైన పదార్థాలు అవి చేస్తే బాగుంటుంది అని సలహా ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత అంతా కూర్చుని భోజనం చేస్తున్న సమయంలో  సరదాగా అనుకున్న మాటలే తప్ప ప్రేమతో చేసిన విందు కాదు ఆ సమావేశం. అలాంటి సందర్భంలో ప్రేమ లేని భోజనం ఎలా ఉంటుంది  పదార్థాలన్నీ స్నేహితులు మనస్ఫూర్తిగా తినగలుగుతారా. మారు లేని కూడు అన్న సామెతగా....  అసలు సామెత అంటేనే భోజనాలు చేస్తూ ఉన్నప్పుడు హస్యాలతో కూడిన మాటలను చెప్పుకోవడం  వాడు భోజనం చేస్తే  ఆ వండిన పదార్థాలు వృధా కావడం తప్ప  ప్రయోజనం ఉన్నదా అలాగే వేమన ప్రశ్న  అలాగే కుటుంబంలో కొంతమంది  ఆ కుటుంబ పెద్దలు అంతకు ముందు చేసిన  పూజలను కొనసాగించడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని  ఆ భగవంతునికి ఇష్టమైన పత్రిని  సమకూర్చుకుని తన అర్ధాంగితో కలిసి  పూజ చేయవలసిన పద్ధతిలో  చేయడానికి ఉపక్రమించి  వారు ఏ దేవతను కొలుస్తున్నారో ఆ దేవతకు సకల  అలంకారాలు చేసి పూజ పూర్తయిన తర్వాత  వేమన ఏమంటున్నాడు అంటే  మనసులో భక్తి లేకుండా  చేసిన పూజ ఫలిస్తుందా.
తల్లిదండ్రులు చేశారు కనుక ఆ పద్ధతిలో చేయాలని వీరు ప్రయత్నం చేసిన దానికి ఏమైనా ఫలితం దక్కుతుందా అన్నది వారి ప్రశ్న  అలాంటి పూజలు చేయడం దానికి ఉపయోగించిన పత్రి వృధా అనేది ఆయన అభిప్రాయం  ఇంతకుముందు దానం చేసేటప్పుడు బంగారాన్ని ఇస్తూ ఉండేవారు  ఎవరికి దానం చేయాలో ఎవరికి చేయకూడదో అన్న విషయాన్ని  ముందు దాత తెలుసుకోవాలి  అవసరమైన వారికి  దానం చేయడంలో తప్పులేదు  పాత్ర నెరిగి దానము అన్న మాట  మన పెద్దలు ఎప్పుడో చెప్పారు  అపాత్ర దానం చేసిన వాడు  పుణ్యానికి నోచుకోడు  అలాంటి వాడికి ఇచ్చిన బంగారు వస్తువులు లేదా బంగారం  ఎందుకు పనికిరాకుండా పోతుందని వేమన అభిప్రాయం వారు రాసిన ఆటవెలదిని ఒకసారి చదవండి.

"ప్రియములేనివిందు పిండి వంటల చేటు  భక్తి లేని పూజ పత్రి చేటు పాత్రమెరుగలేని బంగారు చేటు రా..."


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం