బాలలు కారు అమాయకులు
నేటి బాలలు కారు...
అమాయకులు... !
చిచ్చర పిడుగులు వీరు... !!
దేశభవిత రధ సారధులు... !
భావితరాలకు వారధులు !!
తెలివి తేటలలో వీరు... పెద్దలనె మించి పోతారు... !
విషయ మది ఏదైన...
క్షణాలలో గ్రహిస్తారు... !
బాలలు కారు అమాయకులు...
నేటి బాలలు కారు...
అమాయకులు !
ఆటలలోనూ, చదువులోనూ
చలాకీగానే ఉంటారు... !
ఇంటా బయటా అందరిదగ్గర
మెప్పును పొందుతుంటారు!
భారత మాతకు ముద్దు బిడ్డలు మీరే.. !
దేశ ఖ్యాతిని నిలబెట్టాలి మీరే... !
ప్రపంచం లో... మనజాతీయ జెండాను సగర్వంగా ఎగరేయాలి మీరే... మీరే.. మీరే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి