శివధనస్సు;-కొప్పరపు తాయారు

 ఇది శివుని ఆయుధం.దీనితోనే శివుడు దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. దేవతలందరూ
ఆయనని మెప్పించి ఆ శివధనస్సుని సంపాదిస్తారు.
దానిని మిథిలానగరపు రాజైన దేవవ్రతునికి యజ్ఞ
ఫలంగా బహూకరించారు.
            సీత చిన్నతనంలో ఆడుకుంటూ దాని కిందికి
తన బంతి దూరి పోయినందున చేతితో అలవోకగా
కదిలించి దానిని  చేజిక్కించుకుని ఆటకు వెళుతుంది. ఇది చూచి జనక‌ మహారాజు ఆశ్చర్యపడి ఈ ధనుస్సును ఎవరైతే సంధించి ఎక్కు
పెడతారో. వారితో సీతా కల్యాణం జరుగుతుంది అని
నిశ్చయించారు.ఆవిధంగా శ్రీ రాముడు స్వయంవరం
లో ఆ విల్లుని ఎక్కుపెట్టిన సమయానికి ధనుర్భుంగమై పోతుంది .సీతాదేవి శ్రీరాముల
కల్యాణం జరుగుతుంది.
                ఇంతకీ ఆ ధనుస్సు. పేరేమిటో తెలుసా
పినాకినం అంటారు.
కామెంట్‌లు