దత్తోపంత్ ఠేంగ్డీ ! అచ్యుతుని రాజ్యశ్రీ

 మహారాష్ట్ర లోని ఆర్వీ అనే గ్రామంలో 1920లో దీపావళి రోజు పుట్టారు దత్తోపంత్. తండ్రి న్యాయవాది బాపూరావు తల్లి జానకీబాయి.బాల్యం నుంచి పుస్తకాల పురుగుగా హైస్కూల్ చదువు లోనే  లైబ్రరీలో మరాఠీ హిందీ ఇంగ్లీషు పుస్తకాలు దాదాపు 9వేలు చదివాడు.12_13ఏళ్ళ వయస్సు లో తన స్నేహితులతో కల్సివానరసేన అనే పేరు తో దేశసేవకై నడుంబిగించాడు.తండ్రి చదువుకోవాలి అని  చెప్పినా  వినకుండా స్వాతంత్ర్య ఉద్యమ సభలకి హాజరయ్యేవాడు.తండ్రి కి కోపంవచ్చి ఓరోజంతా అన్నంపెట్టవద్దు అని భార్యను శాసించాడు."దత్తో! బొబ్బట్లు చేశాను. నాన్న చెప్పిన మాట విను" అని తల్లి ఎంత బ్రతిమాలినా "దేశం ముఖ్యం నాకు " అని పస్తున్నాడు.
డబ్బున్న కుటుంబం లో పుట్టినా అతిబీద పిల్లలతో స్నేహం ఆయన జీవితాంతం కొనసాగించాడు.రాజ్యసభ సభ్యుడిగా ఆర్వీ కివచ్చినా  బకారాం అనే కార్మికుని ఢిల్లీకి తీసుకుని వెళ్లి అంతా చూపించి ఆదరించిన  దొడ్డవ్యక్తి.1941లో ఎం.ఏ చదివి ఆర్.ఎస్.ఎస్.లో చేరారు. భారతీయ జనసంఘ్ లో పనిచేస్తూ అంబేద్కర్ కి అభిమాన పాత్రుడైనాడు.ఇద్దరిమధ్య 30ఏళ్ళ తేడా! కానీ ఆయన పై ఓగ్రంధం రాశారు.1955లో భారతీయ మజ్దూర్ సంఘ్ ని ఏర్పాటు చేసి కాషాయజండా భారత్ మాతాకీ జై నినాదంతో17 సెప్టెంబర్ న కార్మిక దినం జరపాలని దత్తోపంత్ ఆదేశించారు.బలరామ జయంతిని రాష్ట్రీయ కిసాన్ దివస్ గాఏర్పర్చారురసాయన ఎరువులు వద్దన్నారు.1994లో స్వదేశీ జాగరణమంచ్ స్థాపించినవారిలో ఒకరు దత్తోపంత్. 12ఏళ్ళు రాజ్యసభ సభ్యుడు గా ఉన్న ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు.చైనాతో సహా ఎన్నో దేశాల్లో పర్యటించిన ఈయన కర్షక శ్రామిక బాంధవుడు.14.10.2004 లో అమరులైనారు🌷
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 095*
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
సుమతీ శతకం పద్యం (౯౫-95) పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! తా.: ఓ మంచి తెలివి గల, బుద్ధిమంతుడవైన, సుమతీ... ఈ ప్రపంచంలో తండ్రికి కుమారుడు/కుమార్తె పుట్టగానే సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం కషణకాలం మాత్రమే వుంటుంది. కానీ అది నిజమైన సంతోషం కాదు,. తన పిల్లు పెరిగి పెద్దవారై, సమాజంలో తమకంటూ ఒక స్థాయి ఏర్పరుచుకుని, నలుగురి చేతా గుర్తింపు పొందినపుడు నిజమైన మానసిక సంతోషం పొందుతాడు తండ్రి ..... ..... అని సుమతీ శతకకారుని వాక్కు. .....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss
చిత్రం