మాట నిలకడ లేనివాడు;- ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మానవులలో రకరకాల మనస్తత్వం కలిగిన వారిని మనం చూస్తూ ఉంటాం. తన పనిని తాను చేసుకుని పోతూ  ఎదుటివారి ఏ విషయాలలోనూ తల దూర్చ కుండా జీవితాన్ని కొనసాగించే  ఉత్తమ మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు  ప్రతిదానికి నేనున్నానంటూ  అవతలవారు చెప్పిన చెప్పకపోయినా  తానే వెళ్లి అన్ని విషయాలను సమర్ధనీయంగా చేశానన్న అహంతో  కార్యక్రమాలకు  న్యాయ నిర్ణీతగా తన అంతట తానే పరిగణించబడుతూ ఉంటాడు  ఇలాంటి వారితో ఈ సమాజం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం కూడా మనకు తెలుసు మాటలలో ఉన్న ఔదార్యం చేతలలో ఏమాత్రం మనకు కనిపించదు  మనసులో ఉన్న మాట ఒకటి బయటకు చెప్పేది ఒకటి  స్వతహాగా ఆయన ఆలోచించుకుంటున్న పద్ధతి మరొక రకంగా ఉంటుంది  అలాంటి వారిని నమ్మవచ్చునా అన్నది వేమన ప్రశ్న.
పూర్వం రాజకీయ నాయకుడి దగ్గర నుంచి  గ్రామస్థాయిలో ఉన్న పంచాయితీ  ప్రెసిడెంట్ సభ్యుని వరకు  నిజాయితీగా తమకు అప్పచెప్పిన పనులను తాను చేస్తూ ఉండేవాడు  కొంతకాలం జరిగిన తర్వాత హామీలతో కాలక్షేపం చేయడం  ఇంతకుముందు వాడు చేసిన పని  చాలా ఘోరంగా ఉంది  ఎందుకు పనికిరాకుండా గ్రామానికి చెడు చేసే విధానం  గా  గ్రామాలను నష్టపరిచింది అంటూ ఆరోపణలు చేస్తూ  తాము పదవులకు వస్తే  అది చేస్తాం ఇది చేస్తాం  నూటికి నూరుపాళ్ళు నిజాయితీగా ప్రవర్తిస్తూ  ప్రతి రూపాయికి లెక్క చెబుతూ  మీ బాగు కోసం మన గ్రామం బాగు కోసం ప్రయత్నం చేస్తాం తప్ప  మరొక ఆలోచనకు తావే ఉండదు అనే మాటలు మాత్రం చెప్తూ ఉంటారు  ఈ చెప్పిన వాటిని కార్యరూపంలో ఏ ఒక్క దానిని నిర్వహించిన దాఖలాలు ఉండవు. ఒక పెద్ద మనిషి  ఆపదలో ఆదుకోమని ఆదరించమని వచ్చిన వ్యక్తిని  నీకు అలా చేస్తాను ఇలా చేస్తాను అని నమ్మించి  చివరకు కార్యరూపంలోకి వచ్చేసరికి  సమయానికి నేను అనుకున్నది కుదరలేదు ప్రస్తుతం నీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాను  అంటూ ఏవో దొంగ మాటలు చెప్పి  తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప  సాయం మాత్రం చేయడు  ఎన్నో ఆశలు పెట్టుకు వచ్చినా  వ్యక్తికి  బాధే మిగులుతుంది  అతను పడ్డ బాధకు సంబంధించిన ఉసురు  అతనికి తగిలి  తర్వాతి కాలంలో అతను ఎన్నో  చెడ్డ అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది  అని ఎంతో అనుభవంతో మనకు హితవు చెబుతున్నాడు వేమన  వారు రాసిన  ఆటగాడి పద్యాన్ని చదవండి ఆ విషయం అర్థం అవుతుంది.

"మొదట నాస బెట్టి తుద లేదు పొమ్మన పరమలోభులైన పాపులకును వారి యుసురుదాకి వగచెడి  పోవరా..."



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం