గ్రామ స్థితి;- ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 జననీ జన్మభూమిశ్చ...అని వాల్మీకి మహర్షి రామునితో లక్ష్మణునకు చెప్పించిన విషయం కన్నతల్లిని కన్న భూమిని ఏ ఒక్కడు మర్చిపోలేడని ప్రపంచానికి తెలుసు  ప్రపంచము అంటే  ప్ర అంటే అతి పెద్దదైన పంచం పంచభూతములతో ఏర్పడిన శరీరము అని అర్థం  అలాంటి జన్మభూమికి  ఏమి ఇచ్చి రుణ తీర్చుకోగలం  నా తల్లి సీతారత్నమ్మ  అల్లారు ముద్దుగా పెంచి మమ్మల్ని ఇంత వారిని చేసింది. పుట్టిన ఊరు తేలప్రోలు  స్వేచ్ఛ స్వాతంత్ర్యం అనే విషయం  తెలియజేసిన స్థలం  భూ ప్రపంచంలో ఎవరు ఎక్కడకు వెళ్లినా ఈ ఇద్దరిని మర్చిపోయే స్థితి ఎవరికి ఉంటుంది అందుకే మా గ్రామం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను.
నువ్వులు పండించే గ్రామం కనుక తేలప్రోలు  గా ప్రసిద్ధి చెందింది  మా గ్రామంలో శివలింగ ప్రతిష్ట గాలిగోపురం ఆవరణలో పరుశురాముడు  జరిపాడని ఉత్తర రామాయణ కర్త ఆడిదం సూరన్న గారి వివరణ  పరశురాముడు భారతదేశంలో 21సార్లు యుద్ధాలు చేసి రాజులను సంహరించుకుంటూ వెళ్లి కన్యాకుమారి వద్ద పరశురాముడు శివుని గూర్చి తపస్సు చేసి మెప్పించాడు  ఈశ్వరుడు ప్రత్యక్షమై నీ తపస్సుకు మెచ్చితిని ఏమి కావాలో కోరుకో అంటే నేను చేసిన హత్యలకు పాప పరిహారం  పరిష్కారం కావాలి అని కోరాడు  అప్పుడు ఈశ్వరుడు నీవు ఇక్కడ నుంచి హిమాలయాల వరకు నా యొక్క లింగముల (శివలింగముల) ప్రతిష్ట చెయ్  మొత్తం 101 లింగాల ప్రతిష్ట జరిగితే నీకు పాప పరిహారం అవుతుంది అని చెప్పాడు అని పురాణ గాధ.
దేశంలో శివలింగ ప్రతిష్టలు శివాలయాలు ఎన్నో ఉన్నాయి కదా అన్న సందేహాన్ని వెలిబుచ్చాడు పరశురాముడు  దానికి శివుడు అన్నీ కూడా తూర్పు ముఖం ఉంచి ప్రతిష్ట జరిగాయి ఇకముందు కూడా అలానే జరుగుతాయి కావున నీవు నీ ప్రతిష్టలు పడమర ముఖంగా ప్రతిష్ట చేసుకుని వెళ్ళు అని చెప్పాడు  అలా ప్రతిష్ట చేస్తూ వెళ్లిన  ఆ నాటి ఒక శివలింగ ప్రతిష్టలో మనకు మా దేవాలయంలో ఉన్న శివలింగం ఒకటి. ఈ ప్రతిష్ట పడమర ముఖంగా దూరంగా ఉంది  కనుక ఈ శివలింగ ప్రతిష్ట పరశురాముడు అతని ఆధ్వర్యంలో జరిగినట్లు చరిత్ర తెలియజేస్తోంది. గాలిగోపురం 1913లో ప్రారంభించి 1915 కి కట్టడం పూర్తయింది  ఈ గోపురాన్ని శనగల అక్కమ్మ గారు కట్టించారు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం