గోడలు... గోడలు... గోడలు...
బలిష్టమైన గోడలు
చేయాలన్న ప్రతి పనికీ అడ్డంకి ఈ గోడ...
మానవ సంబంధాలకే అడ్డంకి ఈ గోడ...
నవ మాసాలు మోసి... కని... పెంచి...
విద్యాబుద్ధులు నేర్పిన అమ్మను
మనసారా అమ్మా అని పిలవడానికి అద్దంకి "మమ్మీ"...
ఉత్తమ భావిభారత పౌరునిగా
తీర్చిదిద్ది అమందానందాన్ని
పొందాలనుకున్న నాన్నను
నాన్నా అని పిలవడానికి "డాడి" అడ్డంకి...
ప్రేమకు అనురాగానికి ఆప్యాయతలకు
ఆలవాలమైన చెల్లిని, అక్కను, తమ్ముని, అన్నను పిలవడానికి అడ్డంకి "నిక్ నేమ్స్"
మన సంస్కృతీ సంప్రదాయాలు పూర్తిగా అడుగంటక మునుపే
ఈ గోడల్ని పడగొట్టాలి.
దీనికి నేను సైతం అంటూ
శ్రీశ్రీ కానవసరం లేదు...
గోడల్ని పడగొట్టడానికి శ్రీ శ్రీ ఆత్మ మనలో ఉంటే చాలు
ప్రగతికి అడ్డుగా ఉన్న గోడల్ని పునాదులతో పడగొట్టడానికి ముందుకురుకుదాం...మనమంతా

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి