దురలవాట్లను మార్చడం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 మానవుడు  యుక్త వయసుకు వచ్చినపుడు  అతని స్నేహితుల ద్వారా  ఆటలలో కానీ చదువులో కానీ  సాంస్కృతిక కార్యక్రమాలలో కానీ పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుంది  దానిని సద్వినియోగం చేసుకొని పైకి వచ్చినవాళ్లు చాలా మంది ఉన్నారు  అలాంటి వారిలో ఎవరైనా  చెడ్డ అలవాట్లకు లోనై ఉంటే  అతని స్నేహితులకు కూడా ఆ అలవాట్లు వచ్చే అవకాశం ఉంటుంది  అందుకే మన పెద్దవాళ్ళు  మంచి స్నేహాన్ని వంద రూపాయలు ఇచ్చి అయినా దగ్గర చేసుకో  అదే చెడ్డ స్నేహితుడు ఉన్నట్లయితే 1000 రూపాయలు ఇచ్చి అయినా వారికి దూరంగా ఉంచు  అలా చేస్తేనే నీ జీవితం బాగుపడుతుంది అని మన పెద్దలు మనకు నీతి పాఠాలు చెప్పడం  మనకు తెలుసు.
ఇలాంటి దొరలవాట్లకు అలవాటు పడిన వ్యక్తులను  తిరిగి మంచి మార్గంలో పెట్టడానికి  మానసిక విశ్లేషకులు బయలుదేరి  దానికోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇలాంటి వారిని పిలిచి  వాడికి ఏ అలవాటు ఉన్నదో తెలుసుకొని  ఉదాహరణకు  స్నేహితుల ద్వారా అలవాటైన మందు  సాయంత్రం ఆ సమయానికి అది లేకపోతే పిచ్చెక్కిపోయేలా ప్రవర్తించే వ్యక్తులను గుర్తించి  వారికి వైద్యం చేయడంలో పేరు తెచ్చుకున్న వారు  కొంతమంది వైద్యులు ఉన్నారు  వారు చేసే పని  ఒంటరిగా అతనిని ఒక గదిలో ఉంచి  అతను ఏ మందు తీసుకుంటాడో దానిని విపరీతంగా తెప్పించి వేరే ఏ పని లేకుండా ఆ ఒక్క పని మీదే మనసును కేంద్రీకరించి  చివరకు దానిపై విరక్తి కలిగేలా  తాగిస్తారు. దానికి అదే వైద్యం అని వారు చెప్పడం  విశేషం  కానీ మనిషికి మనసుంది ఆలోచన ఉంది  అతని ప్రవర్తన ఎలా ఉంటుందో తాగిన తర్వాత అతనికి తెలియకపోయినా  తర్వాత రోజైనా విషయం అర్థం అవుతుంది కదా  అలాంటివాడు ఏదైనా ఒక మంచి విషయం చెప్పినా వినే వారికి ఎలా ఉంటుంది  అరే తాగుబోతు మాటలే నమ్మావా గంగానమ్మ అని  మన పెద్దలు చెప్పిన మాటను రుజువు చేసుకుంటున్నారు అనిపిస్తూ ఉంటుంది  దానితో అతని వ్యక్తిత్వం పాడైపోతుంది కదా  శీల సంపద లేని వ్యక్తి మనిషిగా ఎలా జీవించగలడు  కనుక  జీవితంలో ఏదైనా ఒక మచ్చ ఏర్పడినప్పుడు  దానిని నిదానంగా తుడిచి వేయడానికి ప్రయత్నించాలి తప్ప దానిని పెంచడానికి  ప్రయత్నించకూడదు అన్న విషయం తెలిస్తే  ముందు తాను మానసికంగా సిద్ధం అయి ఉన్నవాడికి ఇది తప్పకుండా పని చేస్తుంది అని  మానసిక విశ్లేషకులు చెప్పే మాట.


కామెంట్‌లు