మనిషిని చూడాలని ఉంది;- డా.నీలం స్వాతి, చిన్న చెరుకూరు గ్రామం, నెల్లూరు.6302811961.
 ఎక్కడ... ఎక్కడున్నావు మనిషీ
నిన్ను చూడాలని ఆరాటపడుతున్నా...
మంచి మనసును హత్తుకోవాలని...
నీ అనురాగ జల్లుల్లో తడవాలని....
నీ ఆత్మీయానుబంధాన్ని
పొదివి పట్టాలని....
ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నా
ఎక్కడ....ఎక్కడున్నావు మనిషీ
నిన్ను చూడాలని ఎదురుచూస్తున్నా....
తడబడుతూ రోడ్డు దాటడానికి
సతమతమవుతున్న ముదుసలిని
రెక్క పట్టుకుని ఊతంగా ఉండి
నాలుగడుగులు వేయించి రోడ్డు దాటిస్తావని...
ఎదురు చూస్తున్నాను మనిషీ...
ఆమె స్థితి చూస్తూ ఒక ప్రక్క
 జాలిచూపుతూనే పరుగులు పెట్టే మనిషి...
నీ తల్లి ఆస్థితిలో ఉంటే మనసున్న
 నువ్వు ఆ స్వారీ ఆపవా మనిషీ...
రోడ్డు దాటించే మనిషిని
 చూడాలని ఉంది ఎక్కడ.... ఎక్కడున్నావయ్యా....
అమ్మా, నాన్నా... ఈ రాక్షసుడి
బారి నుంచి రక్షించండి...
నా మానాన్ని ప్రాణాన్నీ నిలబెట్టండని ఆక్రోశించే
అబల ఆర్తనాదం వినిపించలేదా మనిషీ...
అయ్యే పాపం అంటూనే పరిగెత్తుతున్నావ్...
అదే నీ చెల్లయితే...
అక్కయితే అలా చేస్తావా...
ఆలోచించు మనిషీ....
అన్నలా ఆపన్న హస్తమందించు మనిషీ...
ఎక్కడున్నావు మనిషీ
మనసున్న నిన్ను చూడాలని ఉంది....
అవసరాలకు సహకరిస్తామంటూ...
ఆపదలో ఆదుకుంటామంటూ...
మాయ మాటలు చెప్పి
కాల్ మనీ పేరుతో మనీనే కాదు 
మాన ప్రాణాలను కూడా హరిస్తున్నాడు...
మాట సాయం చేయాన్న అంటూ వేడుకొనే 
సాటి మనిషికి మొహం చాటేస్తావేమిటయ్యా....
మనసున్న మనిష పనిచేసే వాడిని 
చూడాలనుకుంటున్నాను బాబు ఎక్కడ... ఎక్కడున్నావయ్యా....
మనీషను బయటకు తీయ్...
నాలుగ్గోడల మధ్య జరిగే నెలనెలా వెన్నెల 
నిజమైన వెన్నెల కురిపించాలంటే...
నాలుగ్గోడల మధ్య కాదు
నలుగురు మనుషుల్లోకి వెళ్లు
మానవత్వమున్న మనిషిని
ప్రతి మనిషీ చూసేలా ప్రయత్నం చేయ్...
అప్పుడు సఫలమవుతుంది...
ఈ ఆరాటం....ఈ తపన....అస్తు


కామెంట్‌లు