సౌమ్య గుణము (పద్యములు);- కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్-9440522864.
106.ఆ.వె.
మార్గ శీర్ష మందు మదిలోశిరమువంచి
గంగ లోన మునిగి గట్టు పైన 
స్వార్థ భావ మొదిలి స్వామి సేవకు రండి
సౌమ్య గుణము విడక సాగవలయు !!

107.ఆ.వె.
మార్గ మాఘ మధ్య మార్తాండుడుదిశను 
మార్వ సూర్య రథము మహిమ జూపు
తీర్థ యాత్ర లందు తీర్చుకోఋణములు
సౌమ్య గుణము విడక సాగవలయు!!           

108.ఆ.వె.
గంగ శక్తులు మునుగంగ గోచరములు
జీవ నదిగ వలన జేయు మేలు
రోగపాపములను రూపుమాపునిలలో
సౌమ్య గుణము విడక సాగవలయు!!

109.ఆ.వె.
వడివడిగ చినుకుల వానలు కురియగ
పదపద మని జనులు పరుగులిడిరి
పల్లపు పొలములను పండించ సుజనులు
సౌమ్య గుణము విడక సాగవలయు!!

110.ఆ.వె.
వినయములుగలిగి సహకారములుజేసి
మాట లాడు నపుడు మాన్యుడుగను
నిలిచి మనసు పెట్టి నిలువుమా మహిలోన
సౌమ్య గుణము విడక సాగవలయు!!!
                           (ఇంకా ఉన్నాయి)


కామెంట్‌లు