హరివిల్లు రచనలు,; - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
🦚🦚🦚🦚
హరివిల్లు 01
🦚🦚🦚🦚
తప్పులెన్ను వారికి
పట్టవు హెచ్చరికలు ...!
మెప్పు పొందు వారికి
నచ్చవు పొగడ్తలు......!!

🦚🦚🦚🦚
హరివిల్లు 02
🦚🦚🦚🦚
సాకారం సడలినా
సహకారం మానొద్దు...!
వెటకారమనిపించినా
మమకారం వదులొద్దు....!!

🦚🦚🦚🦚
హరివిల్లు 03
🦚🦚🦚🦚
అచ్చ తెలుగు భాషలోన
స్వచ్చమైన ఆనందం.......!
ముత్యపు అక్షరాలతో
ముచ్చటైన మణిహారం....!!

🦚🦚🦚🦚
హరివిల్లు 04
🦚🦚🦚🦚
అదృష్టం వరిస్తే
ఆగర్భ శ్రీమంతమే.....!
దురదృష్టం ఎదురైతే
దౌర్భాగ్య దారిద్ర్యమే....!!

🦚🦚🦚🦚
హరివిల్లు 05
🦚🦚🦚🦚
జూదమాడవలదు
జోరుజోరుగాను......!
వ్యసనముగ మారి
వ్యర్థ జీవనమోను.......!!

                   (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు