హరివిల్లు రచనలు,; కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్, 9440522864.
 హరివిల్లు 11
🦚🦚🦚🦚
సాలెగూడు చూసి
సాధన నేర్చుకో........!
పిట్ట గూడు చూసి
పట్టుదల అలవర్చుకో...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 12
🦚🦚🦚🦚
మకర సంక్రాంతి
సంబరాలు హుందాగా....!
కలిసి మెలిసి కనువిందు
చేద్దాం దర్జాగా................!!
🦚🦚🦚🦚
హరివిల్లు 13
🦚🦚🦚🦚
కుటుంబ వ్యవస్థ
ఒకప్పుడు ఉమ్మడి....!
ఈనాటి వ్యవస్థ 
అలనాడున్న మడి.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 14
🦚🦚🦚🦚
ఇంగిత జ్ఞానం
మనకుంటే చాలు........!
ఇరుగుపొరుగు వారికి
సాయం చేస్తే మేలు........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 15
🦚🦚🦚🦚
ఇతోధిక ఉపకారం 
మనసులో పుట్టాలి.....!
శతాధిక సహకారం
చేతలలో చూపాలి.......!!
                    (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు