మన జీవిత గమ్యం;- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.- సెల్.9491387977.-నాగర్ కర్నూలు జిల్లా.
సృష్టి యందున్న అన్ని జన్మల కన్నా
పుష్టికరం మన మానవ జన్మేనన్నా
అని తెలుసుకొని నడుచుకోవాలి అన్నా
తెలుసుకోకుంటే జీవితమే ఇక సున్నా!

అడగంది మన అమ్మైనా పెట్టదు
శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు
పాపపు పిండాన్ని పులుగైనా ముట్టదు
హాని చేయకుంటే పామైన బుస కొట్టదు!

ఈ వాస్తవాలను తెలుసుకోరా ఓచిన్న
తెలుసుకుంటే ఇక నీవే కదారా
 మిన్న
అప్పుడు అంతా తెలుసుకుంటారు నిన్ను
తప్పక పెడతారు వారు నీపైన  కన్ను !

మనం తెలుసుకోవాలి ఈ జీవిత సత్యాలు
ఇవి జనజీవనాన్ని మెరిపించే ముత్యాలు
వాని వల్ల వనగూడు మనకు బత్యాలు
అప్పుడు చేస్తాములే అంతా నృత్యాలు !

ఆదైవం అందించిన ఈ మానవ జన్మ
వైనం  స్పందించకుంటే అదిమన కర్మ
అనుకొని చేసుకోరాదు ఎలాంటి సర్దుబాటు
కనుగొని తప్పించుకో ఆటుపోటుల వేటు!

అప్పుడౌతుంది నీవెత్తిన మానవ జన్మ ధన్యం
ఇప్పుడే డౌటుంది ఎరగవు నీవు అన్యంపుణ్యం
జీవితమంటే ముళ్ళపొదల కీ కారణ్యం
పొదల పొదుగుల తొలగించి చేరుకో నీజీవిత గమ్యం!

అగమ్యగోచరం కాదులే జీవితం
సమస్యల పరిష్కార ప్రభావితం
మలుచుకుంటే చేతిలో నవనీతం
ఆస్వాదిస్తే జీవితమంతా పునీతం !

ఈ నగ్నసత్యం తెలుసుకొని జీవించు
జీవితం ఆ దేవుడిచ్చిన వరమని భావించు
ఇరుగుపొరుగు వారందరినీ ప్రేమించు
వారందరిలో దేవుడు నీకు కనిపించు!

సమస్యల సంధిస్తూ వేధిస్తుంది
ఆవశ్యం బంధిస్తూ సాధిస్తుంది
వద్దులే ఈ జీవితం అనిపిస్తుంది
ఒద్దిగావుంటే ఫలితం కనిపిస్తుంది!

అనుభవించు రాజా ఇక అనుభవించు
అనుభవాల సారాన్నిక నీవుసేవించు
 పావనమైన జీవితాన్ని గడించు
జీవిత చక్రం వ్యూహాన్నిక ఛేదించు !


కామెంట్‌లు