జీవితంలో ఏ గృహస్తు అయినా తమ బిడ్డలు అభివృద్ధిలోకి రావాలని చదువులలో ముందు ఉండాలని ఆశిస్తారు సామాన్యంగా ఏ ఇంట్లోనైనా కన్న తల్లి బిడ్డకు మొదటి గురువుగా వ్యవహరిస్తుంది. చంటి బిడ్డ వ్యక్తులను గుర్తుపట్టి ఏమో గొణుగుతూ ఉన్నప్పుడు వీరు ఫలానా మీకు తండ్రి అవుతారు నేను అమ్మను అలా ఎవరు వస్తే వారిని పరిచయం చేసి వారి బంధాన్ని కూడా తెలియజేస్తే ఆ చిన్న మనసు దానిని జ్ఞాపకం పెట్టుకుంటుంది కొంచెం పెరిగి ఆటలు పాటలు ఆడే పాడే సమయం వచ్చిన సందర్భంలో తనకు ఒక స్నేహబంధం ఏర్పడుతుంది వారందరితో కొన్ని విషయాలు నేర్చుకుంటాడు అలా అతని జీవితం నేర్చుకోవడంతో ప్రారంభమవుతుంది పూర్వకాలంలో ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కుర్రవాడికి అక్షరాభ్యాసం చేసేవారు. ఒ న మ అన్న అక్షరాలు నేర్పడం మొదలు ఉత్తమ గురువును ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులు ఉన్న ఉపాధ్యాయులలో ఎవరు సహనంతో బిడ్డలకు నేర్పుగా చెప్పగలరో అలాంటి వారిని ఆశ్రయించి తమ బిడ్డకు అక్షరాలు నేర్పమని కోరడంతో ఆ గురువు ఎంతో ఆనందంతో ఆ బిడ్డను తన బిడ్డలా చూసుకుంటూ తన బిడ్డకు అక్షరాలు ఎలా చెబుతాడో కూడా అలాగే చెబుతాడు వీరిలో మళ్లీ రెండు రకాలు ఉంటాయి ఎంత చెప్పినా మనసుకు పట్టని బిడ్డలు కొంతమంది ఉంటారు వారికి వారి మనసు కష్ట పెట్టకుండా వాటికి పదిసార్లు అయినా చెప్పి అతనితో అక్షరాలు చెప్పించడం గురువుగారి ప్రజ్ఞ అలాంటి గురువుల సారధ్యంలో ఎంత అవివేకి అయినా వివేకి అయితీరతాడు. ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి మాట్లాడేటప్పుడు అతను ఎంతవినయంగా ఉండాలో ఆ విషయాలన్నీ ఆ వయసుకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పినవాడు మంచి గురువుగా పరిగణించబడతాడు గురువు అంటేనే చీకటిని పారద్రోలే వాడు అని అర్థం ఎలాంటి అజ్ఞానిని తీసుకొని వచ్చినా ఒక పద్ధతిలో చెపితే మరొక పద్ధతిలో అర్థం చేసుకునే కురవాళ్ళు ఉంటారు వారిని సక్రమమైన పద్ధతిలో తీర్చిదిద్దడం గురువుల బాధ్యత అలాంటి గురువులను ఎన్నుకొని వినయ సంపత్తితో శుశ్రూష చేసిన ప్రతి విద్యార్థి తన జీవితంలో తప్పకుండా మంచి పౌరునిగా తీర్చిదిద్దబడతాడు అని వేమన మనకు తెలియజేస్తూ వ్రాసిన ఆటవెలది పద్యాన్ని చదవండి.
"వాక్కు యందు గుర్వు వాక్తత్వమును గుర్వు చీకటిలో గుర్వు చిక్కియుండు నఖిలమునకు గురువు యాధారమై యుండు..."
"వాక్కు యందు గుర్వు వాక్తత్వమును గుర్వు చీకటిలో గుర్వు చిక్కియుండు నఖిలమునకు గురువు యాధారమై యుండు..."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి