నిజమైన ముని;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 సమాజము అంటేనే వ్యక్తుల కలయిక  ఒక్కొక్క వ్యక్తికి ఒక ప్రత్యేక అభిప్రాయం ఉంటుంది  వారి ఆలోచన ప్రకారం వారి జీవితంలో వారు అనుకున్నది సాధించడం కోసం  అన్నిటికన్న ముఖ్యం సంసారం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ దానికోసం జీవితాన్ని  కొనసాగిస్తూ వెళ్లడం సహజం  కొంతమంది ఆధ్యాత్మిక స్థితిలో ఆలోచిస్తారు. కొంతమంది మానసికంగానూ మరి కొంతమంది శారీరికంగాను ఆలోచిస్తారు  అది వారి బుద్ధి పరిణతిని బట్టి ఆధార పడి ఉంటుంది  కనుక ఎవరి ఆలోచనా పద్ధతిని మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు  దాని వనరులు ఎలా ఉంటాయో  అది సద్వినియోగమవుతుందా దుర్వినియోగం అవుతుందా అన్నది మాత్రం ఆలోచించుకొని చేయాలి  అంటాడు వేమన.
ఒక సమయంలో రమణ మహర్షులవారికి శస్త్ర చికిత్స చేయవలసి వచ్చింది  ఆయన శరీరం కష్టపడకుండా ఉండడం కోసం వైద్యులు వారికి మత్తు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్న  సందర్భంలో స్వామి చెప్పిన మాట  నాది కాని దాని కోసం నేనెందుకు తాపత్రయపడడం  ఆ శరీరం నాది కాదు కదా  దానికి ఎలాంటి మత్తు పదార్థాలు ఇచ్చి నన్ను మగత లోకి  పంపించవద్దు  అని చెప్పారట  అంటే తనువుకు  జీవికి ఉన్న సంబంధం తెలిసిన వాడు మాట్లాడే మాటలు అవి.  జీవి ఈ శరీరంలో ప్రతిదీ చేయగలుగుతుంది కానీ తనువుకు ఆ అవకాశం లేదు  స్వశక్తి మీద ఆధారపడి చేసే  పనులు  ఈ తనువుకు ఉండవు  జీవి చెప్పినట్టుగా ప్రవర్తించడమే  దాని కర్తవ్యం.
ఆధ్యాత్మిక జీవితంలో తాను  ఏ ముక్తిని సాటించాలని  దానిని అనుగ్రహించే భగవంతుని ధ్యానిస్తూ  వాటి పైనే మనసుని కేంద్రీకరించి ఉన్న యోగికి  ఎదుటి వ్యక్తులు అతని గురించి ఎలాంటి మాట్లాడనుకుంటున్నారో ఆయనను పొగుడుతున్నారో తెగడుతున్నారో అన్న ఆలోచన రాదు  తన చుట్టు ప్రక్కల విష జంతువులు వస్తున్నాయా  కీటకాలు తనను  బాధిస్తున్నాయా అన్న విషయాలను దేనిని పట్టించుకోకుండా  పట్టిన పట్టు విడువని  సాహసిలా తన తపో దీక్షను నిర్విఘ్నంగా కొనసాగించినట్లయితే  వాడు తప్పకుండా మోక్ష ప్రాప్తి  పొందుతారు  అని వేమన స్పష్టంగా తెలియజేస్తున్నారు  వారు రాసిన పద్యం ఒక్కసారి చదివితే ఆవేదాంతం అర్థమవుతుంది  చదవండి మరి.

"తిట్టి కొట్టిరేని తిరిగి మారాడక నూరకున్న జూడ నుర్వి మీద వాడగు పరమాత్మ వర్ణింప శక్యమా..."


కామెంట్‌లు