మన గన్నవరం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మా నాన్న గారి పేరు అరుమళ్ళ మండల సుబ్బారెడ్డి గారు  మగ పిల్లవాడు ఒక్కడే కనక ఆడింది ఆట పాడింది పాటగా తన జీవితాన్ని కూడా సాగించారు  సంచిత జన్మ ఫలితంగా  సామాజిక స్పృహతో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు  వితంతు వివాహాలను చేయడంతో  ఆయన కార్యక్రమాలు ప్రారంభమైనవి  కొండపల్లి సీతారామయ్య గారికి  వితంతువుతో వివాహం చేసింది మా నాన్నగారే  ఆ స్ఫూర్తితో  ఆ పరిసర ప్రాంతాలలో అనేక  వివాహాలను ఆదర్శంగా చేయించారు  నా వివాహం కూడా  గోరా గారి నేతృత్వంలో  జరిగింది  రెండు దండలతో వివాహం అయిపోయింది  తరువాత పెద్దల ఆశీస్సులతో తమ ప్రసంగాలను చేశారు చివరిగా మా నాన్న మాట్లాడారు. నేను ఎన్నో ఆదర్శ వివాహాలను చేశాను  ఈరోజు ఇక్కడ నా కుమారునికి  బిడ్డను కన్న వితంతువుతో  వివాహం చేయడం  నాకెంతో ఆనందంగా ఉంది  ఇది  శాస్త్ర సమ్మతమో కాదో నాకు తెలియదు  తాను చేయని తప్పుకు తాను శిక్ష అనుభవిస్తున్న ఒక బాలకు  జీవితాన్ని అందించాలి చక్కటి జీవితాన్ని ఇవ్వాలి  అన్న మంచి అభిప్రాయంతో ఈ కార్యక్రమానికి పాల్గొన్నాను  మీరు ఏ ఒక్కరైనా  దీనిని వ్యతిరేకించినా ఈ క్షణమే ఈ వివాహాన్ని ఆపు చేస్తాను  మీరు చెప్పే నిర్ణయానికి ముందు ఒక క్షణం ఆలోచించండి  14వ సంవత్సరంలో వివాహమై 15  సంవత్సరాలకు గర్భవతిగా ఉండగా వితంతువు అయితే  ఆ బిడ్డను తండ్రిగా మీరు ఏం చేస్తారు ఒక అక్క చెల్లిగా మీరు ఎలా భావిస్తారు ఆలోచించి నిర్ణయం చెప్పండి. అనేసరికి ప్రేక్షకులు మొత్తం  కరతాళ ధ్వనులతో  ఆమోదాన్ని తెలియజేయడం  తర్వాత నాన్న నా మిగిలిన నలుగురు కుమారులకు  ఎంతో వైభవంగా  మన గ్రామంలో మాలపల్లి మాదిగ గూడేమునే కాక  పరిసర గ్రామాలలో ఉన్న వారిని కూడా పిలిచి  అందరికీ భోజనం ఏర్పాటు చేశాను  ఇప్పుడు కనీసం కాఫీ కూడా మీకు ఎవరికీ ఇవ్వడం లేదు దీనికి కారణం  స్తోమత కలిగిన నేను ఎన్నో చేస్తూ ఉంటాను నన్ను చూసి సామాన్యుడు  తన ఆస్తిని అమ్ముకొని  కొంత అప్పు చేస్తాడు. అలా చేయడం నాకు నచ్చదు  అలాంటి వారికి ఆదర్శప్రాయంగా ఉండాలన్న ఏకైక లక్ష్యంతో  ఈ నిర్ణయానికి వచ్చాను  అనేసరికి వేదికపై ఉన్న గొరాగారు ఎంతో ఆనందించి  ఆనందబాష్పాలతో  నాన్నగారిని కౌగిలించుకొని నా కన్నా గొప్ప ఆదర్శంగా జీవిస్తున్నారు అని కొనియాడారు.



కామెంట్‌లు