ఎరుక తెలియాలి;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ ప్రపంచంలోకి మనం వచ్చిన తర్వాత  మనకు తెలియని అనేక విషయాలను మన పెద్దలు  తెలియజేస్తూ ఉంటారు  మనం పాఠశాలలకు వెళ్లి చదువుతున్న పాఠాలు  ఉద్యోగాల వేటకు పనికి వస్తాయి తప్ప  నీ బుద్ధి వికాసానికి పనికిరావు  నీవు ఏ అక్షరాన్ని నేర్చుకున్నావో ఆ క్షణం కానీ  పద్ధతిలో ప్రయత్నం కూడా చేయాలి  సామాన్యంగా మనం ఈ భూమి మీదకు వచ్చినప్పుడు అనేకమంది ఆలోచన ఎలా ఉంటుంది అంటే  మనం ఈ భూమి మీదకు వచ్చాము  హాయిగా జీవితాన్ని గడుపుదాం  ఏది చేయాలనుకుంటే దానిని చేస్తూ కాలం గడిపి  శంకరాచార్యుల వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చెప్పే విషయం పుట్టిన ప్రతివాడికి మరణం తప్పదు అనే కదా  మరణించే వరకు ఈ సుఖాలను అనుభవిద్దాం అని పామరులు అంతా అనుకుంటారు.
ఇలా ఆలోచిస్తున్న మనవాడికి  మరో ప్రపంచం ఉన్నదన్న విషయం  ఆలోచనకు రాదు  ఇలాంటి వ్యక్తులను వేమన అజ్ఞానులుగా  పరిగణించాడు  అజ్ఞాన తిమ్మిరాంధకారంలో సంచరిస్తున్న వ్యక్తులు  విజ్ఞానులుగా మారి  జీవిత సత్యాలను తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేయాలి  ఆ ప్రయత్నం తాను చేసినంతమాత్రం చేత  ఏ మాత్రం సఫలీకృతుడు కాడు అన్న విషయం కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. తాను ఏ విజ్ఞానాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాడో  ఆ విషయాన్ని గురించి స్పష్టమైన ఆలోచన తనకు ముందుగా ఉండాలి  ఈ విషయం ఎలా సాధ్యం  ఎవరి ద్వారా ఈ విషయాలను మనం తెలుసుకోవచ్చు అని ఎక్కడ  గురు సంప్రదాయం ఉన్నదో అక్కడకు వెళ్లి  వారి పాదాలను ఆశ్రయించి తెలుసుకోవలసిన విషయం  అది. మనం చీకటిలో నడిచి వెళుతున్నప్పుడు  అనేక రకాలైన భయాలు చుట్టుముట్టుతాయి  ఏదైనా దయ్యం వస్తే ఏమవుతుంది  మనం వెళుతున్న దారిలో ఏవైనా ముళ్ళు గోతులు లాంటివి ఉంటే ఎలా ఉంటుంది  అన్న విషయాలన్నీ మనసును తొలిచి వేస్తూ ఉంటాయి  అదే చేతిలో ఒక చిన్న లాంతరు ఉన్నట్లయితే  మార్గం స్పష్టంగా కనిపిస్తుంది  నీ ప్రయాణం సుఖ ప్రదమవుతుంది  ఆ లాంతరు చూపే వెలుగు ఒక అద్భుతమైన గురువు  అన్న విషయాన్ని నీవు అర్థం చేసుకొని  ఆ గురువుగారి వద్దకు వెళ్లి నీ జీవిత మార్గం ఏమిటో ముందు వారికి తెలియజేసి  దానికి ఎలాంటి సాధన చేయాలో  దాని పద్ధతులన్నీ గురువుగారి ద్వారా నేర్చుకున్నట్లయితే  నీ సాధన సఫలీకృతమవుతుంది  అంటూ రాసిన పద్యాన్ని ఒకసారి చదవండి.

"ఎరుకుమాలు జీవి యంత కాలంబుండి చచ్చిపుట్టుచుండు సహజముగను యరుక మరచు చోటు నెరుగుట బ్రహ్మంబు..."


కామెంట్‌లు