మా చిన్నన్నయ్య పేరు రామకృష్ణారెడ్డి మా నాన్నకు రామకృష్ణ పరమహంస అంటే తగని భక్తి ప్రపంచానికి ఆధ్యాత్మిక బోధన చేసిన వివేకానందను తయారుచేసిన గురువు అతి చిన్నతనంలోనే ఆధ్యాత్మిక స్థితిలో పరిణతి చెందిన శారద ప్రపంచానికే ఆదర్శప్రాయం స్త్రీ ఎలా ఉండాలో తన ప్రవర్తన ద్వారా తెలియజేసిన మహా సాధ్వి ఆమెను పరమహంస ఎప్పుడూ భార్యగా చూడలేదు తల్లిగా అమ్మవారిగానే చూసేవారు అలాంటి వారి ఆదర్శాలు నచ్చి మా అన్నయ్యకు ఆ పేరు పెట్టారు తను వ్యవసాయంలో ఆరితేరిన వాడు మా గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో ఎస్.ఎస్ ఎల్ సి వరకు మాత్రం చదివి వ్యవసాయ రంగంలో కి వచ్చాడు ఏ వ్యక్తిని ఎలా అదుపులో ఉంచాలో తెలిసినవాడు మా పనివాళ్ళు వాడి చెప్పు చేతల్లో ఉంటారు.తాను పొలంలో పనిచేయడానికి దిగితే మా పాలేరు కానీ కూలీలు కానీ వాడిని మించి చేసినవాడు ఏ ఒక్కరూ లేరు పనిని ఎంత సులువుగా చేయవచ్చునో తెలియచెప్పే ప్రజ్ఞ కడిగినవాడు దుక్కి దున్నడం మొదలు పెడితే ఈ చివర నుంచి ఆ చివర వరకు సాలు ప్రక్కకు వెళ్లడానికి వీలు లేదు మనం తెల్ల కాగితం మీ
స్కేలుతో గీసినట్లుగానే ఉండేది అంత అందంగా వ్యవసాయపు పనులు చేయడంలో నేర్పును సంపాదించాడు ఎవరిని ఎలా చూడాలి ఏ ఏ పనులు వారికి చెప్తే బాగా చేయగలరు అన్న విషయంలో అవగాహన ఉంది కూలీలను మాట్లాడేటప్పుడు కూడా ఎవరు మనకు అనుకూలంగా మనం చెప్పినట్లుగా చేస్తారో అనేటువంటి వారిని చూసి ఏర్పాటు చేసేవాడు.
సాయంత్రం పూట సాహిత్య కార్యక్రమాలకన్నా సాంస్కృతిక కార్యక్రమాలు బాగా ఇష్టం పినిశెట్టి శ్రీరామమూర్తి గారు సుంకర సత్యనారాయణ గారితో కలిసి సుబ్బారావు గారు రాసిన నాటకాలు అంటే వాడికి చాలా ఇష్టం పల్లె పడుచు నాటకం ఎన్నిసార్లు వేశాడో చెప్పలేం దానిలో హాస్య పాత్ర మా రెండవ అన్న చక్కగా చేసేవాడు వాడి జీవితానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర అది. మా భూమి - నాటిక కొన్ని వందల సార్లు ప్రదర్శించాడు. గ్రామంలో ఏ చిన్న తగదా వచ్చినా వారిద్దరినీ కూర్చో పెట్టి సమాధానపరిచే సత్తా రామకృష్ణ అన్నయ్యకు ఉన్నది పనిచేసే సమయంలో కూడా ఇతరుల సుఖాన్ని చూసేవాడు తప్ప వారి ద్వారా ఎక్కువ పనిని రాబట్టాలన్న అభిప్రాయం ఎప్పుడూ ఉండేది కాదు ఒకసారి మన పని చేస్తే మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు అతను రావాలి అన్నది వాడి ఆశయం అందరికన్నా ఎక్కువ పంట పండించింది తనే మా గ్రామంలో.
మన గన్నవరం;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి