మంచి మనసు,; జి.కావ్య,,-9వ.తరగతి,-తెలంగాణ ఆదర్శ పాఠశాల,-బచ్చన్నపేట మండలం,-జనగామ జిల్లా.

 అల్లిపురం అనే గ్రామంలో రమణమ్మ అనే ఒక ముసలమ్మ ఉండేది.ఆమె కుటుంబం మీద ఆధారపడకుండా తనకు చేతనైన పనులు చేసి సంపాదించుకునేది.అలా పక్క ఊరుకు వెళ్లి ఆ ఊరి పాఠశాలలో పిల్లల కోసం పండ్లు,చాక్లెట్లు,బిస్కెట్లు అమ్మేది.పాఠశాలలో చదివే పిల్లలను తన మనుమలు,మనుమరాళ్ళ వలె భావించేది.ప్రతిరోజు ఉదయాన్నే పాఠశాలకు వెళ్ళి సాయంత్రం వరకు తినుబండారాలు అమ్మేది.పిల్లలు ఆమెను అమ్మ అమ్మ అని ఆప్యాయంగా పిలుస్తూ ఉండేవారు.వాళ్లు అలా పిలుస్తుంటే రమణమ్మకు ఎంతో సంతోషం అనిపించేది.ఒకరోజు కావ్య అనే ఒక అమ్మాయి ఆమె దగ్గరికి వచ్చి జామ పండ్లను చూస్తుంది.ఏం కావాలని అడుగుతుంది రమణమ్మ.కానీ అమ్మాయి సమాధానం చెప్పదు.అమ్మ మళ్లీ అడుగుతుంది.నాకు జామకాయ కావాలి.కానీ నా దగ్గర డబ్బులు లేవు అని బాధపడుతుంది.అప్పుడు రమణమ్మ నవ్వుకుంటూ దీనికి బాధపడడం ఎందుకు?ఇదిగో తీసుకో అని ఒక జామకాయ కావ్యాకు ఇస్తుంది.ఆ అమ్మాయి చాలా సంతోషపడుతుంది. నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్తుంది.ఈ విషయాన్ని సాయంత్రం ఇంట్లో వాళ్ళ అమ్మానాన్నలకు చెబుతుంది.వాళ్ళు చాలా సంతోషించి మరునాడు అమ్మాయితో డబ్బులు పంపిస్తారు.ఆ అమ్మాయి రమణమ్మకు ఆ డబ్బులు ఇస్తుంది.ఇలా రోజులు గడుస్తున్నా కొద్ది ఆ అమ్మాయికి రమణమ్మకు అనుబంధం ఏర్పడుతుంది. కొద్దిరోజుల తర్వాత  రమణమ్మ రెండు,మూడు రోజులు పాఠశాలకు పళ్ళు అమ్మడానికి రాలేదు. పిల్లలందరూ చాలా బాధపడతారు.కావ్య మాత్రం ఎందుకు రాలేదని స్నేహితుల ద్వారా తెలుసుకుంటుంది. రమణమ్మకు జ్వరం వచ్చిందని,అందుకే రాలేదని  చెపుతారు.ఆ రోజు సాయంత్రం వాళ్ళ అమ్మని తీసుకొని రమణమ్మ వాళ్ళింటికి వెళుతుంది.వీళ్ళని చూసి రమణమ్మకు చాలా సంతోషం అనిపిస్తుంది.
మనిషికి మనిషికి మధ్య స్నేహం,అనుబంధం ఏర్పడానికి  వయస్సుతో సంబంధం లేదు.ఆ అమ్మాయికి జామపండు ఇవ్వడం వల్ల కృతజ్ఞత పూర్వకంగా ముసలమ్మను కలిసి ఆమె బాగోగులు తెలుసుకుంటుంది.ఆ రోజు నుండి వారి మధ్య చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. సహాయం చేసే గుణం మనుషులను దగ్గర చేస్తుంది.
కామెంట్‌లు