రామాయణం అంటే రామునితో పయనం ,ధర్మ ప్రవృత్తి కలవాడు. అన్నదమ్ముల అనుబంధం ఉన్నవాడు .భార్య భర్తల ప్రేమాభిమానాలు ఉన్న ధర్మబద్ధ సంబంధం ఉన్నవాడు. ఇవన్నీ కూడా నడవడి వల్ల రామాయణంలో రామునివల్ల మనకి చాలా బాగా తెలుస్తుంది. అందుకే రామాయణాన్ని మనం ఒక ఆదర్శంగా తీసుకుంటాం. ఇందులో అనేక మంది వ్యక్తులు ఉన్నారు .వాళ్లల్లో కూడా కొంతమంది ముఖ్య పాత్ర వహించినవారున్నారు. అందులో త్రిజట ఒక ముఖ్యమైన పాత్ర .
ఈమె సీత దగ్గర ఉన్నటువంటి రాక్షస స్త్రీ సమూహానికి నాయకురాలు. కానీ ఈమెలో మంచి గుణాలున్నాయి .ఒకరోజు సీతమ్మ వారి వద్ద ఉన్న రాక్షస స్త్రీలందరూ సీతను బాధ పెట్టే మాటలు మాట్లాడుతుంటే చాలా నరకం అనుభవిస్తున్నాది. అప్పుడే నిద్రలేచి నాకు కల వచ్చింది అని చెప్పింది త్రిజట ఆ కల గూర్చి చెప్పమని త్రిజటని వేడుకున్నారు.
ఆ కలలో రామలక్ష్మణులు తెల్లటి ఏనుగు మీద ఆకాశమార్గంలో వచ్చినట్టు, రాముడు సీతమ్మ చేయి పట్టుకొని ఏనుగు మీద తీసుకొని వెళ్ళినట్టు. తర్వాత ఒక వానరుడు లంకని కాల్చినట్టు అందరూ కూడా చనిపోయినట్టు కలవచ్చిందని, అందులో రాముడు నాకు ఒక మహా విష్ణువుఅవతారంగా అందరి యొక్క బాధలు తీసుకుంటూ అందరిని రక్షిస్తున్నట్టు ఒక మహా విష్ణువు లాగా కనిపించారు లంక సర్వనాశనమైనట్టు విభీషణుడు నలుగురే నలుగురుతో రాజ్య పరిపాలన చేసినట్టు కలొచ్చింది అని చెప్పింది
కొద్దిసేపటికి స్త్రీలు అందరూ మైకం కమ్యూనిటీ కమ్మినట్టు అందరూ పడిపోయి నిద్రపోయారు.అప్పడు వానరుడు వచ్చాడు ఆ వానరుడే ఆంజనేయుడు....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి