అంతః సౌందర్యం (చిట్టి వ్యాసం);- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.


 కష్టం నుండీ, వేదన నుండీ, విషాదం నుండీ, వైఫల్యం నుండీ, సంక్షోభం నుండీ ఎదుటి వారిని లేవనెత్తి, సరైనమార్గానికి చేర్చే మనిషికి ఒక దివ్యమైన మనసు ఉంటుంది. తనచుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుద్ధం చేసి ఆనందపరీమళాలు నింపి ఆత్మగౌరవాన్ని మేల్కొల్పగల్గేదిగా ఉన్న మనీషికుండేది అంతఃసౌందర్యం. అది భౌతిక సౌందర్యంతో ముడిపడనిదీ నిష్కల్మషంగా, నిర్భీతిగా ఉండేదీ ఆశామోహపాశాలకు లొంగనిదీ భక్తీ, ప్రేమా, అనురాగాలకే జీ హుజూర్ అనేది కదూ! అది ఒకమాట, ఒకప్రశ్న, ఒకకవళిక, ఒకవీక్షణం, ఒకస్పర్శ...ఇలా ఏదైనా కావచ్చు. దాని ద్వారా అంతఃసౌందర్యం ప్రకటితమౌతుంది. అది సూక్ష్మతరంగా ఉన్నా, మనకు దాని అనుభవం ప్రస్ఫుటమౌతూనే ఉంటుంది. అంతఃసౌందర్యం కలిగిన వ్యక్తి మనీషిగా కొనియాడబడతాడు !!!

+++++++++++++++++++++++++


కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
అంతఃసౌదర్యం గురించి చిట్టి వ్యాసం బాగుంది. అభినందనలు సార్ 🌹🙏🌹