* కోరాడ నానీలు *

 ఇసుకలో పడింది 
  ఇగిరిపోయింది... 
.    సంద్రంలో పడింది 
        సంద్రమే అయింది !
 .....  *****
హమ్మయ్య... 
  కాస్త  వానకురిసింది.. !
    మావూరి రోడ్లన్నీ నీటితో   
       జారూ, బురదే... !!
       ******
అగ్గిపెట్టె, కొవ్వొత్తి తే 
  ఎందుకు... !?
     కరెంటు ఉందిగా ... 
        వర్షమెత్తిందిగా !!
       *******
 వీధిలో... టీ వీ లు 
    ఫ్యాన్ లు, ఫ్రిజ్ లు 
      అన్నీ కాలి పోయాయ్
         పిడుగు పడింది !
      ********
 ఈ పూట చలి... 
. ఆ పూట ఉక్కపోత 
    సమతుల్యం దెబ్బతింది 
       మనిషిలోనే... !
      *******
కామెంట్‌లు